Breaking News

28/12/2019

పోలీసులకు స్వీయ క్రమశిక్షణ అవసరం

హైదరాబాద్, డిసెంబర్ 28, (way2newstv.in):
సమాజంలో  రోజువారిగా వచ్చే మార్పులకు అనుగుణంగా తగు విశ్లేషణతో పౌర సంక్షేమమే ద్యేయంగా  పోలీసులు పనిచేయాలని తెలంగాణ  రాష్ట్ర  పోలీస్ డైరెక్టర్ జనరల్  ఎం.మహేందర్ రెడ్డి అన్నారు. తెలంగాణ పోలీస్  అకాడమిలో నేడు జరిగిన 175 మంది  నూతనంగా నియమితులైన రిజర్వు సబ్ ఇస్పెక్టర్లు శిక్షణా కార్యక్రమానికి డీజీపీ  ముఖ్య అతిధిగా హజరైయారు. తెలంగాణా రాష్ట్ర  స్పెషల్ పోలీస్ బెటాలియన్స్ అడీషనల్ డీ.జీ.పీ అబిలాష బిస్త్, పోలీస్ అకాడమీ డైరక్టర్ వీకే, సింగ్  కూడా హజరైన ఈ కార్యక్రమంలో డీజీపీ మాట్లాడుతూ పోలీసులు నిరంతరం పౌరులతో మమేకమౌతూ సేవా భావంతో  ప్రజల సంక్షేమమే ద్యేయం గా పనిచేస్తేనే సత్పలితాలు  లభిస్తాయని పేర్కొన్నారు. 
పోలీసులకు స్వీయ క్రమశిక్షణ  అవసరం

పోలీస్ అనేది ప్రతీరోజు  నూతన అవిష్కరణలతో విశ్లేషణతో చేపట్టాలని, పోలీసులకు స్వీయ క్రమశిక్షణ  అవసరమని అన్నారు. అధునాతన సాంకేతిక పరిజ్ఙానంతో  అంతర్జాతీయ స్థాయి లో నేరాలు జరుగుతున్నాయని, విటినీ సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు శాస్త్ర సాంకేతిక రంగంలో పోలీస్ అధికారులు విజ్ఙాన వంతులు కావాల్సిన అవసరం ఉందని మహేందర్ రెడ్డి  అభిప్రాయ పడ్డారు. విషయం పరిజ్ఙానం, నైపుణ్యం, వ్యక్తిత్వ వికాసం, ఐటీ ఆదారిత రంగాలపై నిరంతరం శిక్షణ పొందాలని సూచించారు. పోలీసు శిక్షణ అనేది అత్యంత కఠిణంగా  కాకుండా ఉల్లాస బరితంగా ఉంటూ దేహదారుడ్యాన్ని పెంపొంధించుకుంటూ క్లిష్ల పరిస్థితులను ఎదుర్కొనే విధంగా ఉండాలని సూచించారు.  తెలంగాణ పోలీసు అకాడమీ శిక్షణాలో దేశం లోనే అత్యంత ఉన్నత శిక్షణ సంస్థ అని డీజీపీ చెప్పారు. స్పెషల్ పోలీసు బెటాలియన్ అడీషన్ డీజీపీ అభిలాస బిస్త్ మాట్లాడుతూ పోలీసు శాఖలో మహిళా అధికారులు మరింత మంది రావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. తెలంగాణ  పోలీస్ అకాడమీ డైరెక్టర్ వీకె.సింగ్ మాట్లాడుతూ పోలీసు శిక్షణ  లో పోలీసు అకాడమీ అంతర్జాతీయ ప్రమాణాలను  కలిగి ఉందని తెలిపారు.  తమ అకాడమీ ప్యాకల్టిని అవసరమైతే విదేశాలకు కూడా పంపి పోలీసింగ్ లో వస్తున్న మర్పులను  అద్యయనం చేయించడం జరుగుతుందన్నారు. ఈ శిక్షణ ప్రారంభ కార్యక్రమంలో పోలీస్ అధికారులు నాగిరెడ్డి, రమేష్ నాయుడు, నవీన్ కుమార్, రాజేష్, శిరీష తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment