Breaking News

13/12/2019

బిగ్ బాస్ లోకి ఫర్హఖాన్

ముంబై, డిసెంబర్ 13   (way2newstv.in)
సల్మాన్ ఖాన్ ప్రస్తుతం బాలీవుడ్ లో నెంబర్ వన్ స్టార్ హీరో. సినిమాల్తోనే కాదు, బిగ్ బాస్ షో తోనూ అల్లాడిస్తున్న సల్మాన్ సంపాదన అంతా ఇంతా కాదు. సల్మాన్ ఖాన్ సినిమాలు ప్లాప్ అయినా.. అతని నెక్స్ట్ మూవీస్ మీద భీబత్సమైన క్రేజ్ ప్రేక్షకుల్లో ఉంటుంది. కాబట్టే ప్లాప్ సినిమాలకు కూడా హిట్ కలెక్షన్స్ వస్తాయి. ఇక తాజాగా దబాంగ్ 3 తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సల్మాన్ ఖాన్ ప్రస్తుతం బిగ్ బాస్ 13 సీజన్ హోస్టింగ్ తో బాగా బిజీ. అయితే ఈ నెలాఖరుకి బిగ్ బాస్ హోస్ట్ గా సల్మాన్ రివీల్ అవ్వాల్సి ఉంది. కానీ షో నిర్వాహకులు బిగ్ బాస్ 13 కి వస్తున్న ఆదరణ తో మరో ఐదు వారలు పొడిగించడం సల్మాన్ రెమ్యునరేషన్ భారీగా పెంచడం జరిగాయి. అయితే సల్మాన్ హోస్టింగ్ తో భారీ క్రేజ్ సంపాదించినా బిగ్ బాస్ 13 సీజన్ నుండి సల్మాన్ ఖాన్ ఎగ్జిట్ అంటూ వార్తలొస్తున్నాయి.
బిగ్ బాస్ లోకి ఫర్హఖాన్

భారీ పారితోషకం ఇచ్చినా సల్మాన్ ఖాన్ కి తన అనారోగ్య కారణాల చేతే ఈ షో నుండి తప్పుకుంటున్నట్లుగా బాలీవుడ్ మీడియా టాక్. సల్మాన్ ఖాన్ శని ఆది వారాల్లో షో ని నడిపించే తీరు నిజంగా అద్భుతం. శనివారాల్లో సోమవారం నుండి శుక్రవారం వారికి కంటెస్టెంట్స్ చేసే తప్పులను సల్మాన్ కాస్త కోపం ప్రదర్శిస్తూ వారికీ తెలియజెప్పడం, అవసరమైతే కోపంగా మాట్లాడడం వంటివి చేస్తూ ఆదివారం మాత్రం ఉల్లాసంగా షో ని రక్తి కట్టిస్తున్నాడు అయితే సల్మాన్ కోపతాపాలకు గురైతే.. అతనికి గతంలో మెదడుకి ఓ మేజర్ సర్జరీ జరగడంతో.. దాని వలన స్ట్రెస్ ఫీలైనప్పుడు సల్మాన్ కి ఏదైనా జరగొచ్చని సల్మాన్ కుటుంబ సభ్యులు భయపడుతున్నారట. అయితే సల్మాన్ ని ఆ షో చెయ్యొద్దని వారు చెప్పడంతో… సల్మాన్ బిగ్ బాస్ షో ని వదలడానికి సిద్ధమయ్యాడని, ఒకవేళ సల్మాన్ ఈ షో నుండి ఎగ్జిట్ అయితే గనక ఆ ప్లేస్ లోకి బాలీవుడ్ కొరియోగ్రాఫర్ కం డైరెక్టర్ అయిన పర్హా ఖాన్ ఎంట్రీ ఇచ్చే సూచనలు ఉన్నట్లుగా బాలీవుడ్ మీడియాలో కథనాలు ప్రచారంలోకొచ్చాయి

No comments:

Post a Comment