Breaking News

20/12/2019

కేజ్రీవాల్... క్రేజ్ తగ్గుతోందా..

న్యూఢిల్లీ, డిసెంబర్ 20 (way2newstv.in)
న్నికలకు ఇంకా ఎంతో సమయం లేదు. మరికొద్ది నెలల్లోనే ఢిల్లీ ఎన్నికల నగారా మోగనుంది. ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకునేందుక ఇటు అరవింద్ కేజ్రీవాల్ అటు భారతీయ జనతా పార్టీ అస్త్ర శస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఈసారి ఎలాగైనా ఢిల్లీలో కాలు మోపాలని బీజేపీ భావిస్తుంది. పొరుగున ఉన్న హర్యానా ఎట్టకేలకు సొంతం కావడంతో ఢిల్లీని కూడా సులువుగా చేజిక్కించుకోవన్న ఆలోచనతో కమలనాధులు ఉన్నారు. అయితే అరవింద్ కేజ్రీవాల్ సయితం ఏమాత్రం తగ్గడం లేదు. మరోసారి అధికారం తనదేనన్న ధీమాలో ఆయనలో కన్పిస్తున్నా జరుగుతున్న పరిణామాలు మాత్రం ఆందోళన రేకెత్తిస్తున్నాయి.ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత పార్టీ నుంచి అనేక మంది కీలక నేతలు వెళ్లిపోయారు. వారు బయటకు వెళుతూ అరవింద్ కేజ్రీవాల్ పైనే ధ్వజమెత్తారు. 
కేజ్రీవాల్... క్రేజ్ తగ్గుతోందా..

ఏక పక్ష నిర్ణయాలతో అరవింద్ కేజ్రీవాల్ పార్టీ సిద్ధాంతాలను మంటగలుపుతున్నారని ఫైరయ్యారు. ఈ నేపథ్యంలో కీలక నేతలను జార విడచుకున్న అరవింద్ కేజ్రీవాల్ గత కొద్ది రోజులుగా సంక్షేమ పథకాలపైనే దృష్టి పెట్టారు. మహిళలు, మధ్య తరగతి ప్రజలను ఆకట్టుకునేలా పథకాలను ప్రకటించారు.ఉచిత విద్యుత్తు, మహిళలకు ఉచిత ప్రయాణం వంటివి ఇలాంటివే. అయితే అరవింద్ కేజ్రీవాల్ కు ఈ ఎన్నికల్లో విజయం సాధించడం అంత సులువు కాదు. ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఏడు ఎంపీ సీట్లలో ఆమ్ ఆద్మీ పార్టీ ఒక్క సీటును కూడా గెలుచుకోలేకపోయింది. దీనికి కారణం కాంగ్రెస్ పార్టీయేనని అరవింద్ కేజ్రీవాల్ ఫలితాల అనంతరం తెలిపారు. ముస్లిం ఓట్లను కాంగ్రెస్ చీల్చిందని, మధ్య తరగతి ప్రజలు కూడా కన్ఫ్యూజన్ కు గురయ్యారని ఆయన అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఒంటరిగానే పోటీ చేయడానికి సిద్ధమవుతుంది.ఈ పరిస్థితుల్లో గత ఎన్నికల మాదిరి ఫలితాలు ఉంటాయా? అన్న అనుమానం ఆమ్ ఆద్మీ పార్టీలోనే వ్యక్తమవుతోంది. గత ఎన్నికల్లో ఢిల్లీలో ఉన్న మొత్తం 70 సీట్లకు గాను 67 సీట్లను అరవింద్ కేజ్రీవాల్ గెల్చుకున్నారు. కానీ ఈసారి ఆ పరిస్థితి లేదన్నది మాత్రం వాస్తవం. బీజేపీ బలపడింది. కాంగ్రెస్ కూడా కొంత మెరుగైన ప్రభావం చూపించే అవకాశముంది. అందుకే ఎలాగైనా విజయం సాధించాలని అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సాయం తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. ఇలా అరవింద్ కేజ్రీవాల్ లో మాత్రం ఎన్నికల భయం స్పష్టంగా కన్పిస్తుందనే చెప్పాలి.

No comments:

Post a Comment