సిద్దిపేట డిసెంబర్ 27, (way2newstv.in):
సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గ కేంద్రం మహతి ఆడిటోరియంలో రెండవ విడత పల్లె ప్రగతి సన్నహక సమావేశం లో ఆర్థిక మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి గ్రామీణ ప్రజా ప్రతినిధులు, అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గోన్నారు. ఈ సందర్బంగా అయన పల్లె ప్రగతి పనుల పురోగతి, రోజు వారీ సమీక్ష కోసం ప్రత్యేక యాప్ ను ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ ఎంపీడీవోలు ఈ యాప్ ద్వారా సిద్దిపేట జిల్లాలోని అన్ని మండలాల్లో పల్లె ప్రగతి పురోగతిపై సమీక్ష జరపాలి. జిల్లా కోసం ప్రత్యేకంగా తయారు చేశాం. ఆడియో, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రతీ రోజు సాయింత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు సమీక్ష జరపాలని అన్నారు.
పల్లె ప్రగతి భేటీలో ఆర్ధిక మంత్రి హరీష్ రావు
ఈ యాప్ లో జిల్లాకలెక్టర్, జిల్లా స్థాయి అధికారులు, ఎంపీడీవోలు, ఎమ్మార్వోలు, పంచాయతీ కార్యదర్శులు, జెడ్పీటీసీలు, ఎంపీటీసిలు, సర్పంచిలు ఈ యాప్ లో సభ్యులుగా ఉంటారు. పల్లె ప్రగతి పనులు ఎంత వరకు గ్రామాల్లో జరిగాయి. ఎంత మేర జరగాల్సి ఉంది. ఏ గ్రామం పనుల్లో వెనకపడిందన్నది ఈ యాప్ తెలియజేస్తుంది. పనుల పురోగతిలో వెనక పడ్డ గ్రామాలకు , జిల్లా అధికారులకు ఈ యాప్ ఆటోమెటిక్ గా సమాచారం ఇస్తుందని అన్నారు. వెంటనే అధికారులు ఆ గ్రామాలను పనులు పూర్తి చేయడానికి నిరంతరం పర్యవేక్షణ జరపాలి. ఆదర్శ గ్రామంగా మారడానికి ఏ విషయంలో గ్రామాలు వెనకపడ్డాయో...ఆ వివరాలను యాప్ తెలియదేస్తుంది. తద్వారా ఆ గ్రామాలు ఆదర్శ గ్రామంగా మారడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో సూచిస్తుంది. నేను ప్రతీ రోజు యాప్ ద్వారా ఓ మండలం సమీక్ష లో పాల్గొంటా. ఈదఫా యువత ఎక్కువ గా సర్పంచిలయ్యారు. అందువల్లే పోటీ పడి సర్పంచ్ లు తమ గ్రామ అభివృద్ధికి పని చేస్తున్నారని అన్నారు. గతంలోఎన్నడూ లేని విధంగా పల్లె ప్రగతి లో ప్రజల భాగస్వామ్యం ఎక్కువ గా ఉంది. సర్పంచ్ లు సైతం ఈ కార్యక్రమం ద్వారా ప్రజల మధ్య గౌరవాన్ని పొందారని మంత్రి అన్నారు.
No comments:
Post a Comment