కేబినెట్ మీటింగ్ లో జగన్
విజయవాడ, డిసెంబర్ 27, (way2newstv.in)
ఏపీ ప్రజల్లో ఉత్కంఠం రేపిన కేబినెట్ సమావేశం ముగిసింది. దాదాపు రెండు గంటల పాటూ సాగిన సమావేశంలో.. మంత్రివర్గం రాజధాని అంశంపై ఏ సంగతీ తేల్చలేదు. సమావేశంలో టేబుల్ ఐటెంగా మాత్రమే జీఎన్‌రావు కమిటీ రిపోర్ట్‌ను తీసుకొని.. కేబినెట్‌లో చర్చించారు. బోస్టన్ కన్సల్టెంట్ గ్రూప్ రిపోర్ట్ కోసం వేచి చూడాలని ప్రభుత్వం భావిస్తోందని తెలుస్తోంది.. ఆ రిపోర్ట్ కూడా జనవరి 3న వచ్చే అవకాశం ఉందట. అలాగే శ్రీకృష్ణ కమిటీ, శివరామశ్రీకృష్ణన్ కమిటీ, జీఎన్ రావు కమిటీ ఇచ్చిన నివేదికలోని అంశాలను కేబినెట్ పరిశీలించినట్లు సమాచారం.మరోవైపు రాజధాని తరలింపుపై మంత్రులతో జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
విశాఖ మరో హైద్రాబాద్ అవుతుంది
రాజధాని తరలింపుపై తొందరపాటు లేదని.. ఏదైనా క్లియర్‌గా ప్రజలకు చెప్పి చేద్దామని వ్యాఖ్యానించారట. ఎన్ని వేల కోట్లు పెట్టినా అమరావతిని అభివృద్ధి చేయలేమన్నారట. లక్ష కోట్లలో పదిశాతం పెట్టిన విశాఖను హైదరాబాద్ కంటే ధీటుగా అభివృద్ధి చేస్తామని సీఎం అన్నారట.మరోవైపు మంత్రివర్గ సమావేశంలో హైకోర్టు తరలింపుపై విధివిధానాలు.. విశాఖలో సచివాలయం తరలింపుపై మంత్రుల సూచనల్ని సీఎం అడిగి తెలుసకున్నట్లు సమాచారం. ఇక రాజధాని అంశంపైనా మంత్రుల్లో కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాదు రాజధాని అంశంపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలనే ఆలోచన కూడా ఉండొచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి.ఈ కీలక అంశాలతో పాటూ అమరావతి అభివృద్ధి, తిరిగిచ్చే ప్లాట్లపైనా కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాజధాని ప్రాంతంలో రైతుల ఆందోళన, సీఆర్డీఏ వ్యవహారాలు కేబినెట్‌లో చర్చకు వచ్చినట్లు సమాచారం అందుతోంది. ఇక అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ వ్యవహారంపై దర్యాప్తు బాధ్యతల్ని సీబీఐకి అప్పగించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం
No comments:
Post a Comment