హైద్రాబాద్, డిసెంబర్ 23, (way2newstv.in)
కొత్త సంవత్సరం వేడుకలలో ఏలాంటి చోటు చేసుకోకుండా పోలీసు ఉన్నతాధికారులు డిసెంబర్ 31 రాత్రి ఆంక్షలు విధించారు. నూతన సంవత్సర వేడుకలకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల ఎస్‌పిలతో సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా కొత్త సంవత్సరానికి స్వాగతం పలికే దృష్టా యువత ప్రమదాలకు, వివాదాలకు చోటివ్వకుండా పోలీసులు అప్రమత్తంగా ఉండాలని పోలీసు బాసులు జిల్లా స్థాయి అధికారులకు ఆదేశాలిచ్చారు. ముఖ్యంగా నూతన సంవత్సరం వేడుకలను నిర్వహించే హోటల్, పబ్, ఫాంహౌస్‌లతో సమావేశాలు నిర్వహించి వారికి పోలీసు ఆంక్షలను తెలియజేయాలని పోలీసు బాసులు పేర్కొన్నారు. అదే విధంగా ఈవెంట్ నిర్వాహకులు ముందస్తుగా పోలీసుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని తెలిపారు.
న్యూఇయర్ పై నిఘా
ఈవెంట్ జరిగే ప్రాంతాల్లో సిసిటివి కెమెరా రికార్డింగ్ ఫెసిలిటీ ఉండాలని, అదేవిధంగా పార్కింగ్ వాహనాల వద్ద కూడా సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్వహకులకు ముందస్తుగా తెలియజేయాలన్నారు. నూతన సంవత్సర వేడుకలను నిర్వహించే ఈవెంట్ల యాజమాన్యం పోలీసుల అనుమతి పొందిన టికెట్ల కంటే ఎక్కువ టికెట్లు విక్రయిస్తే వారిపై కేసులు నమోదు చేయాలని సూచించారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ 31 రాత్రి లిక్కర్ అమ్మకాల విషయంపై ఎక్సైజ్ అధికారులతో చర్చిస్తున్నామని, మద్యం అమ్మకాల సమయాన్ని కుదించేలా చర్యలు చేపట్టనున్నారు. వేడుకల సందర్బంగా డిజె, బాణాసంచా తదితర వాటిపై స్థానిక పోలీసులు నిఘా సారించాలన్నారు. కొత్త సంవత్సరం వేడుకలలో జరిగే ఘటనలకు స్థానిక పోలీసులు బాధ్యత వహించాల్సి ఉంటుందని పోలీసు బాసులు హెచ్చరించారు. పబ్, హోటల్స్, ఫాంహౌస్‌లలో జరిగే ఈవెంట్లో ఏదైనా ప్రమాదం జరిగితే ఈవెంట్ నిర్వాహకులను బాధ్యులుగా చేసి కేసులు నమోదు చేయాలని ఆదేశాలిచ్చారు. అదేవిధంగా నూతన సంవత్సర వేడుకలను ప్రశాంతంగా నిర్వహించుకునేందుకు పోలీసులు అన్ని విధాల శ్రమించాలని, ఎవరైన నిబంధనలు అతిక్రమించిన, ఆంక్షలను ఉల్లఘించినా వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని జిల్లాల ఎస్‌పిలకు పోలీసులు బాసులు ఆదేశాలిచ్చారు. డిసెంబర్ 31న ఆపదలో ఉన్నవారు. ఇతరుల వల్ల ఇబ్బందులకు గురయ్యేవారు వెంటనే డయల్ 100కి ఫోన్ చేసి సమాచారం అందించాలని సూచించారు. ప్రమదాలు, ఘర్షణలకు పాల్పడే వారిపై సమీప పోలీసు స్టేషన్‌లలో ఫిర్యాదు చేయాలని, బాధితుల ఫిర్యాదుపై జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని జిల్లా ఎస్‌పిలకు పోలీసు బాసులు ఆదేశాలిచ్చారు.
No comments:
Post a Comment