Breaking News

23/12/2019

10 శాతం కాలేజీలకు న్యాక్ గుర్తింపు

హైద్రాబాద్, డిసెంబర్ 23, (way2newstv.in)
రాష్ట్రంలోని సర్కారీ, ప్రైవేట్విద్యాసంస్థలు నేషనల్అసెస్మెంట్ అండ్అక్రెడిటేషన్ కౌన్సిల్(న్యాక్) గుర్తింపును పట్టించుకోవట్లేదు. సరైన వసతుల్లేక ప్రైవేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాలేజీలు ముందుకు రాకపోగా, రెగ్యులర్ఫ్యాకల్టీ లేక సర్కారీ కాలేజీలు గుర్తింపు తీసుకునేందుకు ముందుకు రావట్లేదు. దీంతో కేంద్రం నుంచి వచ్చే రూసా నిధులు, సౌకర్యాలకు కాలేజీలు నోచుకోవట్లేదు. దరఖాస్తు, రికార్డుల తయారీ, ఇతర వసతుల కోసం లక్ష రూపాయలు ఇస్తామని ఉన్నత విద్యామండలి ప్రకటించినా ప్రైవేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాలేజీలు ముందుకు రావట్లేదు. దీంతో మేనేజ్మెంట్లతో మీటింగ్ పెట్టి న్యాక్ గుర్తింపుపై అవగాహన కల్పించాలని కౌన్సిల్నిర్ణయించింది.రాష్ట్రంలో 2,319 ప్రభుత్వ, ప్రైవేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డిగ్రీ, పీజీ, ప్రొఫెషనల్కాలేజీలున్నాయి. వీటితోపాటు కేంద్ర, రాష్ట్ర పరిధిలోని 18 యూనివర్సిటీలున్నాయి. 
10 శాతం కాలేజీలకు న్యాక్ గుర్తింపు

2019–20 విద్యాసంవ్సతరానికి 229 కాలేజీలకే న్యాక్గుర్తింపునిచ్చింది. అందులో 216 కాలేజీలు కాగా, 13 యూనివర్సిటీలున్నాయి. 2017–18లో ఐదు వర్సిటీల పరిధిలోని 57 అటానమస్ కాలేజీలకు గుర్తింపు దక్కగా, 2018–19లో 59 కాలేజీలకు న్యాక్ గుర్తింపు వచ్చింది. అన్ని విద్యా సంస్థలకు న్యాక్ గుర్తింపు తప్పనిసరిగా ఉండేట్టు చర్యలు తీసుకోవాల్సిందిగా యూనివర్సిటీ గ్రాంట్స్కమిషన్(యూజీసీ) గతంలోనే రాష్ట్రాలకు ఆదేశాలిచ్చింది. ఆ గుర్తింపు ఉంటేనే రాష్ట్రీయ ఉచ్ఛతర్ శిక్షా అభియాన్ నిధులను విడుదల చేస్తమని ప్రకటించింది. అయినా మేనేజ్మెంట్లలో మాత్రం మార్పురాలేదు. కొన్ని కాలేజీ లు ప్రయత్నిస్తున్నా, సరైన వసతులు లేకపోవడంతో రావట్లేదు. ఒకే కోర్సున్న కొన్ని కాలేజీలు దానిపై ఆసక్తే చూపించట్లేదు. ఏపీలో మాత్రం మూడేళ్లలో ఏటా న్యాక్ గుర్తింపున్న కాలేజీల సంఖ్య పెరుగుతోంది. 2016–17లో 202 ఉంటే, 2017–18లో 181, 2018–19లో 333, 2019–20లో 363 కాలేజీలకు గుర్తింపు లభించింది.రాష్ట్రంలో విద్యాశాఖ పరిధిలో 10 యూనివర్సిటీలున్నాయి. వాటిలో ఏడు వర్సిటీలకే న్యాక్ గుర్తింపు ఉంది.  రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్(ఆర్జీయూకేటీ), జవహర్లాల్నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్యూనివర్సిటీ (జేఎన్ఏఎఫ్ఏయూ), శాతవాహన వర్సిటీలకు గుర్తింపు దక్కలేదు. ఓయూకు ఏ+(ఏ ప్లస్) గ్రేడ్దక్కగా, కాకతీయ, జేఎన్టీయూకు ఏ గ్రేడ్, తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు, పొట్టిశ్రీరాములు వర్సిటీలకు బీ గ్రేడ్ లభించింది. ఇక, న్యాక్ గుర్తింపు రావాలంటే కాలేజీ సొసైటీ పేరుతో ల్యాండ్ ఉండాలి. సొంత బిల్డింగ్ఉండాలి. నిబంధనల మేరకు ఫ్యాకల్టీ ఉండాలి. విద్యాప్రమాణాలు, మౌలిక వసతులు, ల్యాబ్, లైబ్రరీ వంటి కనీస సౌకర్యాలూ కాలేజీల్లో తప్పనిసరిగా కల్పించాలి. ప్రొఫెసర్లు, లెక్చరర్లు, సిబ్బంది సంఖ్య నిబంధనల ప్రకారం ఉండాలి. కానీ, మెజారిటీ కాలేజీల్లో అవేవీ లేవు. గుర్తింపు తీసుకోని కాలేజీలతో పోలిస్తే న్యాక్ గుర్తింపున్న కాలేజీల్లో అడ్మిషన్లూ ఎక్కువగా ఉంటున్నాయి.

No comments:

Post a Comment