Breaking News

07/12/2019

గ్రీన్ ఛాలెంజ్…మొక్కలు నాటిన సీఎస్ జోషి

హైదరాబాద్ డిసెంబర్ 7 (way2newstv.in)
గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా మేడిపల్లి అర్బన్ ఫారెస్ట్ పార్క్ లో చీఫ్ సెక్రటరీ ఎస్కే జోషి మొక్కలు నాటారు. తరువాత  గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా ఎపి సీఎస్ నీలం సహాని, స్పెషల్ సీఎస్ రాజేశ్వర్ తివారి, పిసిసిఎఫ్ శోభలకు గ్రీన్ ఛాలెంజ్ విసిరారు. పోలీస్ హౌసింగ్ బోర్డ్ చైర్మన్ కోలేటి దామోదర్ విసిరిన గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరించిన చీఫ్ సెక్రెటరీ శనివారం మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో అటవీశాఖ స్పెషల్ సీఎస్ రాజేశ్వర్ తివారి, అటవీ సంరక్షణ శాఖ ప్రధానాధికారి ఆర్. శోభ, సీఎం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్, మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఎం.వి రెడ్డి, ఇతర అధికారులు పాల్గోన్నారు. 
గ్రీన్ ఛాలెంజ్…మొక్కలు నాటిన సీఎస్ జోషి

సీఎస్ మాట్లాడుతూ గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటడం సంతోషంగా ఉంది. నాకు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దామోదర గుప్తా గ్రీన్ ఛాలెంజ్ విసిరారు.నేను 3 మొక్కలు నాటాను. మరో ముగ్గురు ఎపి సీఎస్  నీలం సహాని, స్పెషల్ సీఎస్ రాజేశ్వర్ తివారి, పీసీసీఎఫ్ శోభ లకు ఛాలెంజ్ చేస్తున్నానని అన్నారు. మూడు  మొక్కలు ఎందుకు నాటలి అంటే మనకు సరిపోయే అక్షిజన్ మూడు మొక్కలు ఇస్తాయి. హరితహారం ప్రాధాన్యతను అందరూ గుర్తించాలి. ప్రతి ఒక్కరు హరితహారం లో పాల్గొని పర్యావరణ ను కాపాడాలని అయన అన్నారు. నాకు గ్రీన్ ఛాలెంజ్ చేసిన దామోదర్ గుప్తాకు కృతజ్ఞతలని అన్నారు.  పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దామోదర్ గుప్తా మాట్లాడుతూ నేను చేసిన గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించిన సీఎస్ ఎస్కె జోషికి ధన్యవాదాలు. గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా ఇవ్వాళ మేడిపల్లి లో  మొక్కలు నాటడం సంతోషంగా ఉంది.  ఈ కార్యక్రమంలో అనేక మంది ప్రముఖులు, సామాన్యులు ఇన్వాల్ అయ్యారు. పర్యావరణను కాపాడుకోవడం చాలా ముఖ్యమని అన్నారు.

No comments:

Post a Comment