Breaking News

23/12/2019

శ్మశాన వాటిక ఆక్రమణపై కలెక్టర్ కు ఫిర్యాదు

వనపర్తి డిసెంబర్ 23  (way2newstv.in):

60 ఏళ్లుగా వున్న శ్శశాన వాటికను రియల్ ఎస్టేట్ వ్యాపారి తన స్వలాభం కోసం గుడి పేరుతో ఆక్రమించుకోంటున్నడని వనపర్తి జిల్లా గోపాల్ పేట మండలం బుద్ధారం గ్రామ రైతులు సోమవారం జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతికి వినతి  పత్రాన్ని  సమర్పించారు . 237 సర్వేనెంబర్ లోని ఊరు గట్టు దగ్గర 16 ఎకరాల 32 గుంటల భూమి గత 60 సంవత్సరాలుగా స్మశాన వాటిక కొనసాగుతుందని,అట్టి దాన్ని ఈ మధ్యకాలంలో మునగాల కృష్ణారావు అనే రియల్  ఎస్టేట్ వ్యాపారి తన స్వలాభం, స్వార్థం కోసం ఆ భూమిని గుడి పేరుతో ఆక్రమించుకుంటూ శవాలను పెట్టకుండా అడ్డుకుంటున్నారని వారు వినతి పత్రంలో పేర్కొన్నారు.
శ్మశాన వాటిక ఆక్రమణపై కలెక్టర్ కు  ఫిర్యాదు


ప్రతి గ్రామంలో స్మశాన వాటికకు ప్రభుత్వం   ప్రతిష్టాత్మకంగా కృషి చేస్తుంటే మా గ్రామంలో స్మశానవాటిక లేకుండా చేస్తున్నారని ,అట్టి వారిపై తగిన చర్యలు తీసుకుని గ్రామంలో స్మశానవాటిక కొనసాగించాలని, అదేవిధంగా ఊర గట్టు ఆనుకొని ఉన్న చెరువును మట్టి తో పూడ్చే వారిపై తగిన చర్యలు తీసుకోవాలని ఆ గ్రామ రైతులు కలెక్టర్ సమర్పించిన వినతి పత్రంలో పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో రమేష్ గౌడ్. మైబు. నాగరాజు .రమేష్ గౌడ్ లచ్చ గౌడ్.శ్రవణ్ కుమార్ లతో పాటు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment