హైదరాబాద్ డిసెంబర్ 23 (way2newstv.in)
మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ఈనెల 29వ తేదీన అందజేయనున్నారు. ఈ విషయాన్ని సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. ఇవాళ ఉదయం జరిగిన జాతీయ సినిమా అవార్డుల ప్రదానోత్సవానికి జ్వరం కారణంగా అమితాబ్ హాజరుకాలేదు. అయితే రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ రాష్ట్రపతిభవన్‌లో ఈనెల 29న అమితాబ్‌కు ఫాల్కే అవార్డు అందజేయనున్నారు. ఆ కార్యక్రమానికి ఫిల్మ్ అవార్డులు గెలిచినవారంతా హాజరుకానున్నారు.
29న అమితాబ్‌కు ఫాల్కే అవార్డు ప్రదానం
భారత సినిమా పితామహుడిగా దుండిరాజ్ గోవింద్ ఫాల్క్‌ను గుర్తిస్తారు. ఆయన పేరుపై ఫాల్కే అవార్డును 1969లో స్టార్ట్ చేశారు. భారతీయ సినీరంగంలో ఇదే అతిపెద్ద అవార్డుగా భావిస్తారు. విజేతకు స్వర్ణ కమలంతో పాటు పది లక్షల క్యాష్ ప్రైజ్‌ను విజేతకు అందజేస్తారు. ఇవాళ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు జాతీయ సినిమా అవార్డు విజేతలకు అవార్డులను అందజేశారు.
No comments:
Post a Comment