హైద్రాబాద్, నవంబర్ 29, (way2newstv.in)
ఉస్మానియా హాస్పిటల్ పాత భవనానికి పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయించాలని సర్కారు నిర్ణయించింది. బిల్డింగ్ పునరుద్ధరణకు ఆగాఖాన్‌ట్రస్ట్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌తెలిపారు. హైదరాబాద్ కోఠిలోని ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ కార్యాలయంలో ఆగాఖాన్ ట్రస్ట్‌ప్రతినిధులతో మంగళవారం ఆయన భేటీ అయ్యారు. పాత కట్టడం ఎలా ఉందో, పునరుద్ధరణ తర్వాత కూడా అలాగే ఉండాలని ఈటల సూచించారు. రూ.23 కోట్లతో పాత భవనాన్ని పటిష్టం చేయనున్నట్టు వెల్లడించారు. ప్రస్తుతం పాత భవనంలో 350 బెడ్లు ఉండగా, ఇప్పటికే 250 బెడ్లను షిఫ్ట్ చేశారు. మిగిలిన వాటిని కూడా త్వరలోనే ఖాళీ చేసి, బిల్డింగ్‌ను ఆగాఖాన్ ట్రస్ట్‌కు అప్పగించనున్నారు. ఆస్పత్రి నిర్మాణ సమయంలో వాడినట్టే, మరమ్మతులకు డంగ్ సున్నమే వాడనున్నారు.జిల్లాలవారీగా వైద్య సేవలు, హెల్త్ ప్రోగ్రామ్స్‌పై ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు, 33 జిల్లాల మెడికల్, హెల్త్‌ఆఫీసర్లు, టీవీవీపీ, ఎన్‌హెచ్‌ఎం అధికారులతో ఈటల సమీక్ష జరిపారు.
ఉస్మానియా వర్శటీకి మరమ్మత్తులు
సీజన్‌కో జబ్బు వస్తోందని, ఆరోగ్య శాఖ ఏడాదంతా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముందన్నారు. చలి పెరుగుతున్న కొద్దీ స్వైన్‌ఫ్లూ విజృంభించే ప్రమాదమున్న నేపథ్యంలో నివారణ చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. సుమారు 500 బెడ్ల కెపాసిటీతో అన్ని జిల్లా దవాఖాన్లలో ఐసోలేటెడ్ వార్డులు సిద్ధం చేశామని చెప్పారు. దగ్గు, జలుబొచ్చినా ప్రభుత్వ దవాఖానకు వచ్చి టెస్టులు చేయించుకోవాలని సూచించారు. డెంగీ ఇప్పుడు కొంత తగ్గిందని, నివారణ చర్యలు కొనసాగిస్తున్నామని ఈటల చెప్పారు. దేశంలో టీబీ కేసుల గుర్తింపు, వారికి అందిస్తున్న చికిత్స విషయంలో తెలంగాణ ప్రథమ స్థానంలో ఉందని మంత్రి వెల్లడించారు. బస్తీ దవాఖాన్ల అంశంలో కేంద్రం నుంచి అవార్డు వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.ప్రైవేటు దవాఖాన్లకు వెళ్లి రూ.లక్షలు ఖర్చు చేసుకోవద్దని ఈటల సూచించారు. చిన్న చిన్న జబ్బులకు కూడా పెద్ద దవాఖాన్లకు పోయే పరిస్థితిలో మార్పు రావాలని, ఇందుకోసం రిఫరల్ సిస్టమ్ ను బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. తొలుత ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను బలోపేతం చేస్తామని చెప్పారు. ఖాళీలను భర్తీ చేసే వరకూ, ఇప్పుడున్న స్టాఫ్‌నే సమర్థంగా వినియోగించుకుంటామన్న మంత్రి, త్వరలోనే స్టాఫ్ రేషనలైజేషన్ చేపడతామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ ఆరోగ్యశ్రీ, ఈహెచ్‌ఎస్‌పథకాలను సమర్థంగా అమలు చేస్తామని ఈటల అన్నారు. ప్రభుత్వ దవాఖాన్లలో ట్రీట్‌మెంట్ అందుబాటులో ఉన్నా.. ప్రజలు ప్రైవేటు హాస్పిటళ్లకు వెళ్లి డబ్బులు వృథా చేసుకుంటున్నారన్నారు. ఆరోగ్యశ్రీ ఉన్నప్పటికీ, అధిక డబ్బులు వెచ్చిస్తున్నారన్నారు. హెల్త్‌ప్రొఫైల్‌పై మీడియా ప్రశ్నించగా.. ప్రొఫైల్ అని పేరు పెట్టనప్పటికీ, ప్రజల ఆరోగ్య వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నామని తెలిపారు.‘‘ప్రసవ నొప్పులను గర్భిణులు భరించలేకపోతున్నారు. వారిని చూసి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. దీంతో చాలామంది గర్భిణులు, వారి కుటుంబ సభ్యులు సిజేరియన్ చేయాలని ఒత్తిడి చేస్తున్నారు. మరికొందరు ముహూర్తాలు చూసుకొని మరీ ప్రైవేటు హాస్పిటళ్లలో సిజేరియన్‌చేయించుకుంటున్నారు” అని ఈటల చెప్పారు.
No comments:
Post a Comment