Breaking News

02/11/2019

గన్నవరంలో వంశీ వారసుల కోసం పోరు

గన్నవరం, నవంబర్ 2 (way2newstv.in)
కృష్ణాజిల్లాలో మారిన రాజ‌కీయాలు అన్ని పార్టీల్లోనూ ఆస‌క్తి రేపుతోంది. ఇక్కడ నుంచి ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ సునామీని త‌ట్టుకుని మ‌రీ టీడీపీ నాయ‌కుడు వ‌ల్లభ‌నేని వంశీ వ‌రుస‌గా రెండోసారి ఎమ్మెల్యేగా విజ‌యం సాధించారు. అయితే, ఐదు మాసాలు కూడా తిర‌గ‌క‌ముందే వల్లభనేని వంశీ పార్టీకి, త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి కూడా రాజీనామా చేశారు. పైకి వల్లభనేని వంశీ రాజ‌కీయాల‌కు దూరం అవుతాన‌ని ప్రక‌టించినా.. ఆయ‌న‌కున్న క్రేజ్‌ను బ‌ట్టి, మాస్ లీడ‌ర్‌గా ఆయ‌న సంపాయించుకున్న క్రెడిబిలిటీని బ‌ట్టి.. రాజ‌కీయాల‌కు దూరం కార‌ని అంటున్నారు. 
గన్నవరంలో వంశీ వారసుల కోసం పోరు

ఇక‌, ఇదే స‌మ‌యంలో వల్లభనేని వంశీ అనుచ‌రుల నుంచి వ‌స్తున్న వార్తలను బ‌ట్టి.. న‌వంబ‌రు మూడు లేదా నాలుగు తేదీల్లో ఆయ‌న వైసీపీ తీర్థం పుచ్చుకుంటార‌నే క‌థ‌నాలు వ‌స్తున్నాయి.వల్లభనేని వంశీ పార్టీకి రాజీనామా చేయ‌డాన్ని తీవ్రంగా ప‌రిగ‌ణిస్తున్న టీడీపీ ఆయన‌ను నిల‌బెట్టుకునేందుకు శ‌త విధాల ప్రయ‌త్నాలు చేస్తోంది. ఇప్పటికే విజ‌య‌వాడ ఎంపీ నానిని రంగంలోకి దింపి ఆయ‌న‌తో చ‌ర్చలు కూడా చేయించింది. అయితే, వల్లభనేని వంశీ మాత్రం త‌న ప‌ట్టు వీడేలా క‌నిపించ డం లేదు. వల్లభనేని వంశీ వైసీపీలోకి వెళితే ఎలాగూ ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేయాలి. అది జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి రూల్‌. దీంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యంగా మార‌నుంది. ఇదే జరిగితే.. అధికార పార్టీ వైసీపీకి, ప్రతిప‌క్షం టీడీపీకి కూడా ఈ ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకం కానుంది. త‌న సీటును నిల‌బెట్టుకునేందుకు టీడీపీ, ఇక్కడ ఎలాగైనా ప‌ట్టు సాధించేందుకు వైసీపీ ప్రయ‌త్నాలు సాగించ‌నున్నాయ‌నేది నిజం. ఈ క్రమంలోనే అభ్యర్థుల ఎంపిక ప్రతిష్టాత్మకంగా మార‌నుంది.టీడీపీ నుంచి వ‌చ్చి వైసీపీలో చేరుతున్నవల్లభనేని వంశీకే వైసీపీ గ‌న్నవ‌రం టికెట్‌ను కేటాయిస్తుందా? లేక ఇక్కడ నుంచి ఇట‌వ‌ల ఎన్నిక‌ల్లో ఓడిపోయిన యార్లగ‌డ్డ వెంక‌ట్రావునే నిల‌బెడుతుందా ? అనేది చూడాలి. మ‌రోప‌క్క, టీడీపీలో ఇప్పటికే ఇద్దరు కీల‌క నాయ‌కులు రంగంలో ఉన్నారు. మాజీ మంత్రి దేవినేని ఉమ .. ఇక్కడ నుంచి పోటీ చేసి గెలుపు గుర్రం ఎక్కాల‌ని భావిస్తున్నారు అదే స‌మ‌యంలో విజ‌య‌వాడ తూర్పు ఎమ్మెల్యే గ‌ద్దె రామ్మోహ‌న్ భార్య అనురాధ‌.. ఇక్కడ నుంచి పోటీ చేయాల‌ని కుతూహలంతో ఉన్నారు. మాజీ మంత్రి దేవినేని విష‌యానికి వ‌స్తే.. ఈయ‌న‌కు ఈ టికెట్ ఇస్తే.. ఆయ‌న‌ను వ్యతిరేకించే వ‌ర్గం త‌ట‌స్థంగా ఉండే అవ‌వ‌కాశం ఉటుంది. దీంతో వైసీపీ విజ‌యం న‌ల్లేరుపై న‌డ‌కే అవుతుందిఅయితే, దేవినేని గెలిస్తే.. టీడీపీకి మంచి ఫైర్ బ్రాండ్ అందివ‌చ్చిన‌ట్టు అవుతుంది. ఆయ‌న ఓడిపోయినా.. జ‌గ‌న్ ప్రభుత్వంపై త‌ర‌చుగా విమ‌ర్శలు సంధిస్తున్నారు. ఇలాంటి నాయ‌కుడు అసెంబ్లీలో ఉంటే బెట‌ర‌ని అనేవారు కూడా ఉన్నారు. ఇక‌, అనురాధ విష‌యానికి వ‌స్తే.. గ‌న్నవ‌రం నియ‌జ‌క‌వ‌ర్గం వీరి సొంత నియోజ‌క‌వ‌ర్గం. ఇక్కడ మంచి ప‌ట్టుంది. గ‌తంలో ఎన్టీఆర్ టికెట్ ఇవ్వక‌పోతే.. రామ్మోహ‌న్ సొంత‌గా రెండాకుల గుర్తుపై పోటీ చేసి 10 వేల భారీ మెజారిటీతో విజ‌యం సాధించారు. అలాంటి నియోజ‌క‌వ‌ర్గంలో అనురాధ అయితే… ఎలాంటి విభేదాలు లేకుండా పార్టీ మొత్తం ఇక్కడ స‌హ‌క‌రిస్తుంది. దీంతో ఆమె వైసీపీకి గ‌ట్టి పోటీ ఇచ్చే అవ‌కాశం ఉంటుంది. ఈ నేప‌థ్యంలో టీడీపీలో ఈ టికెట్‌ను ఎవ‌రికి కేటాయిస్తార‌నే విష‌యం ఆస‌క్తిగా మారింది.

No comments:

Post a Comment