Breaking News

03/10/2019

మామిడి తోటలో పులి సంచారం.

భయాందోళనలో గ్రామల ప్రజలు .
సంచారాన్ని తేల్చలేని అటవీ శాఖ అధికారులు
జగిత్యాల  అక్టోబర్ 03 (way2newstv.in)
జగిత్యాల జిల్లా,మల్యాల మండలం, మ్యాడంపల్లి శివారులో ఓ రైతుకు చెందిన మామిడి తోటలో చిరుత పులి సంచారం స్థానికులను భయాందోళనలకు గురి చేస్తోంది.గ్రామంలోని నరేగుట్టప్రాంతంలో ఉన్న సత్రవేని లింగయ్య అనే రైతుకు చెందిన మామిడి తోటలో బుధవారం సాయంత్రం 5 గంటలకు పశువుల కోసం వస్తుండగా కొందరు యువకులు వీడియో తీసి స్థానికులకు పోస్టు చేసి అప్రమత్తం చేశారు.
మామిడి తోటలో పులి సంచారం.

దింతో పులి సంచరిస్తున్న విషయంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురి అవుతున్నారు.ఈ విషయం తెలుసుకున్న అటవీ శాఖఅధికారులు పులి సంచారాన్ని నిర్ధారించడానికి మామిడి తోటలో పులి కాలి పాదాల ఆనవాలను సేకరించి గుర్తించేందుకు సంబంధిత పరిశోధన కేంద్రానికి పంపినట్లు తెలుస్తోంది.అయితేసమీపంలో గుట్టలు ఉండడంతో వన్య మృగాలు ఉండే అవకాశం ఉంటుందని అభిప్రాయం వ్యక్తం అవుతున్న అటవీ శాఖ అధికారులు మాత్రం పులి సంచారంను అధికారికంగా తేల్చలేదు.అటు కొండగట్టు ప్రాంతంలోనూ గేదెపై పులి దాడి చేసిందనే ప్రచారం జరిగింది. మల్యాల మండలం ముత్యంపేటకు చెందిన పశువుల కాపరి మేత కోసం మసీదుగుట్ట వద్ద తీసుకెళ్లగా పుర్రెశ్రీనివాస్ కు చెందిన గేదె మెడ కింద తీవ్ర గాయం కావడంతో చిరుత దాడి చేసినట్లు భావించారు. జిల్లాలోని రెండు చోట్ల పులి సంచరిస్తుందని అక్కడి స్థానికులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

No comments:

Post a Comment