ప్లాస్టిక్ రహిత నాగర్ కర్నూలు పట్టణం లక్ష్యంగా చర్యలు
- మున్సిపల్ కమిషనర్ జయంత్ కుమార్ రెడ్డి
నాగర్ కర్నూలు అక్టోబరు 3, (way2newstv.in)
గురువారం నాగర్ కర్నూలు పట్టణంలోని మటన్ విక్రయదారులు, కూరగాయల వ్యాపారస్తులకు సమావేశం నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ జయంత్ కుమార్ రెడ్డి ఈ భేటీకిహజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్టోబరు 2 నుంచి పూర్తిస్థాయిలో నిషేధంవిధించామని ఒక్కసారి వాడే ప్లాస్టిక్ సంచులను వాడినా జరిమానలు విధిస్తామనిహెచ్చరించారు.ఫ్లాస్టిక్ రహిత నాగర్ కర్నూలుయై లక్ష్యంగా చర్యలు చేపట్టాం, దశల వారీగా ప్లాస్టిక్ వాడకాన్ని నియంత్రిం చేందుకు గాను.. గాంధీ జయంతి అక్టోబర్ 2వ తేదీ నుంచి ఫ్లాస్టిక్నుపూర్తిస్థాయిలో నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నామన్నారు.
ప్లాస్టిక్ పై నిబంధనలు మరింత కఠినతరం…
ఫ్లాస్టిక్ కవర్లు వాడితే జరిమానా విధించనున్నమని, మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో నాగర్ కర్నూలు లో ఎక్కడా ఫ్లాస్టిక్నువినియోగించకుండా పకడ్భందీ చర్యలు తీసుకున్నామని మున్సిపల్ కమిషనర్ తెలిపారు. భవిష్యత్ తరాల కోసం ఫ్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేదించేందు కు నిర్ణయించామన్నారు.ఎట్టి పరిస్థితిలోన్లూ ఫ్లాస్టిక్ను ప్రజలు వినియోగించకుండా చూడాలంటే వారికి దీని వల్ల కలిగే అనర్థాలను వివరించాలనే ఉద్దేశంతో ప్లాస్టిక్ నిషేదంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని,ఇప్పటికే పలు చోట్ల అధికారులు ఫ్లాస్టిక్ వాడకం వల్ల కలిగే నష్టాలపై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేశామని, ప్రచార వాహనాల ద్వారా ఫ్లాస్టిక్ వాడకం వల్ల వాతావరణంలో కలిగేమార్పులు ప్రజలకు ఎంత నష్టం వాటిల్లు తుందనే దానిపై ప్రచారం చేస్తున్నామన్నారు. కిరాణా షాపులు, ఇతర దుకా ణాల్లో ఫ్లాస్టిక్ బ్యాగుల వాడకాన్ని పూర్తిస్థాయిలో తగ్గిం చారు. జిల్లాకేంద్రంలోని కిరాణా వర్తకసంఘం ఆధ్వర్యంలో కిరాణా దుకాణాలలో ప్లాస్టిక్ కవర్లను వాడితే సంఘం ఆధ్వర్యంలోనే జరిమానా విధిస్తామని కట్టడి చర్యలు తీసుకున్నామని కమిషనర్తె లిపారు.మున్సిపల్ అధికారులు వర్తక వాణిజ్య అధికారులతో ఫ్లాస్టిక్ కవర్ల నిషేధంపై అవగాహన సదస్సు నిర్వహించామని, కిరాణా దుకాణాల్లో ఉపయోగిస్తే మున్సిపాల్ సిబ్బంది విధించేజరిమానా కూడా కట్టాల్సి ఉం టుందని షరతు విధించారు. గాంధీ జయంతి సందర్భంగా కలెక్టర్ శ్రీ శ్రీధర్ ఫ్లాస్టిక్ నిషేధానికి ఆదేశించారని, బుధవారం నుంచి జిల్లా కేంద్రంలోని, వ్యాపారవాణిజ్య కేంద్రాల నిర్వహకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో జాయింట్ కలెక్టర్ మట్లాడారు. అక్టోబరు 2 నుంచి నాగర్ కర్నూల్ పట్టణంలో ఫ్లాస్టిక్ పూర్తిస్థాయిలో వాడకుండానిషేధించేందుకు చర్యలు తీసుకుంటున్నా మన్నారు.వాడితే భారీ జరిమానానే..ఫ్లాస్టిక్ నిషేదాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఏవ్యక్తి కూడా ఎట్టి పరిస్థితు ల్లోనూ 50 మైక్రాన్ల కంటే తక్కువగా ఉన్న పలుచటి ప్లాస్టిక్, పాలిథిన్కవర్లను వాడకూడదని హెచ్చరిస్తున్నారు. ఒకసారి రీసైక్లింగ్ అయిన ఫ్లాస్టిక్ తయారు చేయబడిన ప్లాస్టిక్, పాలిథిన్ కవర్లను పూర్తిస్థాయిలో నిషేధించారు. 20 మైక్రాన్ల కంటే తక్కువగాఉన్న ఫ్లాస్టిక్ బాగ్యులను అమ్మితే రూ.5వేల జరిమానా, 30మైక్రాన్ల కంటే తక్కు వగా ఉన్న ఫ్లాస్టిక్ బ్యాగును వాడితే రూ.500 జరిమానా విధించనున్నట్లు మున్సిపల్ కమిషనర్జయంత్ కుమార్ రెడ్డి ప్రకటించారు. ఇతరవాటికి రూ.500నుంచి రూ.5 వేల వరకు జరిమానా విధించనున్నారు. నియామాలను అతిక్రమించిన వ్యాపా రులకు జరిమానా, చట్టప్రకారంచర్యలు తీసుకొనున్నారు. ఫిర్యాదుల పరిశీలన కోసం నాగర్ కర్నూల్ పట్టణంలో బృందాలను ఏర్పాటు చేశామన్నారు. ఫిర్యాదు అందితే పరిశీలించి.. వాడినట్లు తేలితేజరిమానా విధించనున్నామన్నారు.ప్లాస్టిక్ నిషేధానికి పట్టణ ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావాలన్నారు.ప్లాస్టిక్ రహిత నాగర్ కర్నూల్ ను మార్చేందుకు గాంధీ జయంతి సందర్భంగా బుధవారం నుంచి ప్లాస్టిక్ కవర్లను నిషేధించేందుకు ప్రతీ ఒక్కరు స్వచ్ఛందంగా ముందుకురావాలని, కోరారుప్లాస్టిక్ వినియోగించ మని, వ్యాపారస్తుల తో ప్రతిజ్ఞ చేయించారు ఈ సమావేశంలో మున్సిపల్ సిబ్బంది మటన్, కూరగాయల వ్యాపారస్తులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment