Breaking News

10/10/2019

జగన్ తో భేటీ కానున్న చిరంజీవి

హైద్రాబాద్, అక్టోబరు 10, (way2newstv.in)
చిరంజీవి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌తో భేటీకానున్నారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు అమరావతిలో సీఎంతో చిరంజీవి, రామ్‌చరణ్‌లు సమావేశంకానున్నారు. కొద్దిరోజులక్రితం చిరు సీఎం జగన్ అపాయిట్‌మెంట్ కోరారట.. ఈ మేరకు సీఎంవో గురువారం అపాయింట్‌ మెంట్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. జగన్‌తో సైరా సినిమా గురించి చర్చించనున్నమెగాస్టార్.. సినిమా చూడాలని సీఎంను కోరబోతున్నారట. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక జగన్‌తో చిరంజీవి తొలిసారిగా సమావేశంకాబోతున్నారు.మెగాస్టార్ జగన్‌ను కలవడంవెనుక చాలా కారణాలు వినిపిస్తున్నాయి. 
జగన్ తో భేటీ కానున్న చిరంజీవి

సైరా సినిమా స్పెషల్ షోలు ప్రదర్శించేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అలాగే జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఇప్పటి వరకు చిరంజీవికలవ లేదు. అందుకే జగన్‌ను కలిసి ధన్యవాదాలు తెలపడంతో పాటూ సీఎంగా బాధ్యతలు స్వీకరించినందుకు శుభాకాంక్షలు తెలిపేందుకే అమరావతి వెళ్తున్నారని తెలుస్తోంది. కొద్దిరోజుల క్రితమే తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరాజన్‌ను చిరంజీవి కలిశారు. సైరా సినిమా చూడాలని కోరారు.. ఆమె కూడా కుటుంబంతో కలిసి మూవీని వీక్షించారు. అలాగే జగన్‌నుకూడా సినిమా చూడాలని చిరంజీవి ఆహ్వానించనున్నారు. స్వాతంత్ర్య పోరాటయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా సైరా నరసింహారెడ్డి సినిమా సురేందర్‌రెడ్డిదర్శకత్వంలో తెరకెక్కింది. మెగాస్టార్ చిరంజీవి ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా.తన నటనతో ఆకట్టుకున్నారు. సైరా నరసింహారెడ్డి సినిమాకు ప్రముఖుల నుంచి ప్రశంసలు వస్తున్నాయి.సినిమా కూడా సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది.

No comments:

Post a Comment