తిరుమల అక్టోబర్ 23(way2newstv.in)
వైకుంఠనాథుడు తిరుమల శ్రీవారిని తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ దర్శించుకున్నారు. ఆమెకు టిటిడి ఉన్నతాధికారులు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. తొలుత వరాహస్వామిని దర్శించుకున్న గవర్నర్ ఆతర్వాత స్వామివారి సేవలో పాల్గొన్నారు.
వెంకన్న సన్నిధీలో తెలంగాణ గవర్నర్
అనంతరం రంగనాయకుల మండపంలో ఆమెకు అర్చకులు వేదాశీర్వచనం పలికారు.ఆలయం వెలుపలకు చేరుకున్న గవర్నర్ మీడియాతో మాట్లాడుతూ స్వామిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. తిరుమలలో వసతి సదుపాయాలు, నిర్వాహణ బాగుందని కితాబిచ్చారు.
No comments:
Post a Comment