Breaking News

23/10/2019

శ్రీవారి దర్శన ఏర్పాట్లు అద్భుతం !

బ్రిటిష్ హై కమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ ప్రశంసలు
తిరుపతి అక్టోబర్ 23(way2newstv.in)
శ్రీవారి దర్శనం మహదానందం... ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయని రెండు తెలుగు రాష్ట్రాల బ్రిటిష్ హైకమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ కొనియాడారు. బుధవారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్న అనంతరం బ్రిటిష్ దౌత్యాధికారి స్వర్ణ తిరుమల అతిధి గృహంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని కలిశారు. 
శ్రీవారి దర్శన ఏర్పాట్లు అద్భుతం !

ప్రఖ్యాతి గాంచిన పుణ్యక్షేత్రం తిరుమలలో దర్శన ఏర్పాట్లు, భద్రతా చర్యలు, పర్యావరణ పరిరక్షణలాంటి అంశాలకు సంబంధించి ప్రపంచంలోనే అత్యున్నత స్థాయిలో ఉన్నాయని అబ్బురపడ్డారు. ఇంత గొప్పగా నిర్వహిస్తున్నందుకు పాలక మండలిని, సిబ్బందిని అభినందించారు. టీటీడీ ఆధ్వర్యంలో భక్తులకు అందిస్తున్న సేవల గురించి సుబ్బారెడ్డి ఆయనకు వివరించారు. దౌత్యాధికారితోపాటు డిప్యూటీ హెడ్ ఆఫ్ మిషన్ వరుణ్ మాలి, రాజకీయ ఆర్థిక సలహాదారు నళిని రఘురామన్, కమ్యూనికేషన్స్ హెడ్ పద్మజ ఉన్నారు.

No comments:

Post a Comment