మెదక్, అక్టోబరు 29, (way2newstv.in)
సంగారెడ్డికి కొత్త అందాలు సంతరించుకున్నాయి. వాహనదారుల ఇబ్బందులను దూరం చేసేందుకు రోడ్డు విస్తరణ పనులను త్వరితగతిన పూర్తి చేసి జిల్లా కేంద్రానికి నూతన శోభను సంతరించుకునేలా తీర్చిదిద్దారు. రోడ్డు వెడల్పుతో పాటు సెంట్రల్ లైటింగ్, రోడ్డుకిరువైపులా మురుగు కాలువల నిర్మాణం, మధ్యలో డివైడర్ ఏర్పాటు చేసి పూలమొక్కలను నాటాడంతో ఆహ్లాదకరంగా తయారు చేశారు. ఈ రోడ్డు గుండా నిత్యం ప్రయాణం చేసే వాహదారులు తమ గమ్యస్థానాలకు సురక్షితంగా చేరుకుంటున్నారు.పట్టణం గుండా అకోలా-నాందేడ్ ప్రాంతాలకు ప్రయా ణం చేసే భారీ వాహనాలతో పాటు నిరంతరం 161రహదారి రద్దీగా ఉండేది.
సంగారెడ్డకి కొత్త రూపే
ఎన్నో ఏండ్లుగా సింగిల్ రోడ్డు ప్రయాణంతో ఎన్నో కుటుంబాలు ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోయి రోడ్డున పడిన సంఘటనలు కోకొల్లలు. పట్టణం చుట్టూ బైపాస్ రోడ్లు లేకపోవడం తరుచూ ప్రమాదాలకు నిలయంగా మారాయి. సంగారెడ్డిగ్రేడ్-1 మున్సిపాల్టీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం నిధులను మంజూ రు చేసింది. ఇందుకోసం పోతిరెడ్డిపల్లి చౌరస్తా నుంచి సంగారెడ్డి పట్టణం మహబుబ్‌సాగర్ చెరువుకట్ట వరకు రోడ్డు విస్తరణ పనులు శ్రీకారం చుట్టారు. సంబంధిత అధికారులు రోడ్డు విస్తరణ పనులకు ప్రణాళికలు తయారు చేసి రూ. 14.48కోట్ల నివేదికలను ప్రభుత్వానికి పంపించారు. జిల్లా కేంద్రం అభివృద్ధికి ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. అకోలా- నాందేడ్ 161రహదారి విస్తరణతో పాటు రోడ్డుకిరువైపుల మురికికాలువల నిర్మాణం, పుట్‌పాత్, రోడ్డు మధ్యలో గోడ నిర్మాణానికి ప్రత్యేక నిధులు కేటాయించింది. ఇందుకోసం రూ. 6.87కోట్లను విడుదల చేసి పనులను త్వరగా పూర్తిచేశారు. రోడ్డుపై వర్షపు నీరుతో రహదారి పాడవకుండా ఉండేందుకు అధికారులు చర్యలు తీసుకుని రోడ్డ నిర్మాణాన్ని ప్రణాళికబద్దంగా తీర్చిదిద్దారు. అలాగే బీటీ రోడ్డు పనులకు రూ. 3.35కోట్లకు పైగా నిధులను ఖర్చు చేశారు. సెంట్రల్ లైటింగ్ సిస్టం ఏర్పాటుకు రూ. 1.34కోట్లకు నిధులు ఖర్చు పెట్టి పనుల పురోగతి సాధించారు. ఇతర పనులకు గాను రూ. 2.26కోట్ల నిధులతో అందంగా తీర్చిదిద్దారు. పోతిరెడ్డిపల్లిలోని ఎన్టీఆర్ చౌరస్తాలో 161,165 జాతీయ రహదారులపై నిరంతర వెలుగులు విరజిమ్మెలా రూ. కేటాయించి హైమాస్ట్ లైట్లను బిగించారు. విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్స్, ఏటీ అండ్ ఎచ్‌టీ లైన్ల పునరుద్ధరణకు రూ. 27లక్షలను కేటాయించి పనులను పూర్తిచేశారు. రీచ్‌లా నిర్మాణాలకు రూ. 32లక్షలను కేటాయించి నిర్మాణ పనులను పూర్తిచేసి అందుబాటులోకి తెచ్చి ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా రవాణా వ్యవస్థను మెరుగుపర్చారు.
No comments:
Post a Comment