సిద్దిపేట, ఫిబ్రవరి 04(way2newstv.in)
సోమవారం నుంచి ప్రారంభమయిన పుల్లూరు బండ శ్రీ లక్ష్మి నరసింహ స్వామి మాఘమాస జాతర సందర్భంగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. శ్రీ లక్ష్మీనరసింహస్వామి మాఘమాస జాతర సందర్భంగా సిద్దిపేట ఏసిపి రామేశ్వర్, సిద్దిపేట రూరల్ సీఐ వెంకట్రామయ్య, ఎస్ఐ కోటేశ్వరరావు,కలిసి పుల్లూరు లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానాన్ని సందర్శించి టెంపుల్ చుట్టుపక్కల పార్కింగ్ స్థలాలను, ధర్మ దర్శనం, ప్రత్యేక దర్శన స్థలాలను, మరియు కుండమును, టెంపుల్ ఆవరణను పరిశీలించారు.
పుల్లూరు నరసింహస్వామి ఉత్సవాలకు బందోబస్తు
ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో వివిధ మండలాల నుండి వేలాదిగా తరలి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించారు. ప్రజలకు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని అన్నారు. ఇద్దరు ఎస్ఐలు, నలుగురు ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు లు, కానిస్టేబుళ్లు, మహిళా కానిస్టేబుళ్లు, మహిళా హోంగార్డులు, టెంపుల్ కు సంబంధించిన వాలంటీర్లతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
No comments:
Post a Comment