Breaking News

25/01/2020

కొడంగల్లో రేవంత్ రెడ్డికి షాక్

రంగారెడ్డి జనవరి 25 (way2newstv.in)
శనివారం వెలువడిన తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డికి భారీ షాక్ తగిలింది. రేవంత్ గతంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కొడంగల్లో కాంగ్రెస్ కు చేదు ఫలితాలు వచ్చాయి.  కొడంగల్ మున్సిపాలిటీలో అధికార టీఆర్ఎస్ హవా కొనసాగింది. 
కొడంగల్లో రేవంత్ రెడ్డికి షాక్

మొత్తం 12 వార్డుల్లో గులాబీ పార్టీ ఏడు స్థానాలలో విజయకేతనం ఎగురవేసింది. కాంగ్రెస్ కేవలం మూడు స్థానాలకు సరిపెట్టుకుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా రేవంత్ రెడ్డి కొడంగల్కు ఎక్కువ సమయం కేటాయించినప్పటికీ ఫలితం లేకపోయింది. గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పునరావృత్తం చేస్తూ.. కొడంగల్ మున్సిపాలిటీలో టీఆర్ఎస్ విజయం సాధించింది. తాజా ఫలితాలతో కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర నిరాశకు గురయ్యాయి.

No comments:

Post a Comment