బి.లింగుస్వామి సమర్పణ లో జొన్నలగడ్డ శ్రీనివాస్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం "ఆటో రజని" ప్రేమెంత పనిచేసే నారాయణ సినిమా తో తన డాన్స్ లతో ,యాక్టింగ్ తో మంచి పేరు తెచ్చుకున్న జొన్నలగడ్డ హరికృష్ణ హీరోగా తెరకెక్కుతున్న పవర్ ఫుల్ మాస్ ఎంటర్టైనర్ "ఆటో రజని".జొన్నలగడ్డ హరిక్రిష్ణ రెండవ సినిమా గా వస్తున్న ఈ సినిమా కు ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులు అందించారు ..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆశీస్సుల తో ప్రారంభమైన "ఆటో రజని" చిత్రం.
ఆయన ఎంతో బిజీ గా ఉండి కూడా ఇండస్ట్రీలో కి కొత్తగా వచ్చిన మా హీరోకి ఆయన బ్లెస్సింగ్స్ ఉండటం ఆనందంగా ఉంది అన్నారు దర్శకులు జొన్నలగడ్డ శ్రీనివాస్. ఈ శుక్రవారం సాయంత్రం తాడేపల్లి లోని వైస్సార్సీపీ కార్యలయం లో వైస్ జగన్ కలసి బ్లెస్సింగ్స్ తీసుకున్నాడు జొన్నలగడ్డ హరికృష్ణ.ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులు అందుకున్న మొదటి చిత్రం గా మా "ఆటో రజని" నిలిచిపోతుంది అన్నారు దర్శక, నిర్మాతలు. అంతే కాకుండా ఎలెక్షన్ టైం లో మేము చేసిన 'జననేత జగనన్న' పాట గురించి ప్రత్యేకంగా మమ్ములను జగనన్న అభినందించడం జీవితంలో మర్చిపోలేముఅలాగే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే స్టార్ట్ కానుంది. హీరోయిన్ ,ఇంకా ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల పూర్తి వివరాలు త్వరలో తెలియ జేస్తామన్నారు..దర్శకులు జొన్నలగడ్డ శ్రీనివాస్.
No comments:
Post a Comment