నెల్లూరు అక్టోబర్, 12 (way2newstv.in)
ప్రతిష్టాత్మకమైన రైతు భరోసా పధకాన్ని నెల్లూరులో ఈ నెల 15న సిఎం జగన్ మోహన్ రెడ్డి ప్రారంభిస్తున్నట్లు మంత్రి అనిల్ కుమార్ తెలిపారు. శనివారం అయన మీడియాతో మాట్లాడారు. జగన్ పాలనలో రైతాంగాన్ని పూర్తి స్ధాయిలో ఆదుకునే దిశగా ప్రభుత్వ సుపరి పాలనలో భాగంగా పధకాన్ని అమలుకు అడుగులు పడుతున్నాయని అన్నారు.
రైతు భరోసాను ప్రారంభించనున్న సీఎం జగన్
నెల్లూరు జిల్లాలో సోమశీల ప్రాజెక్టులో రికార్డు స్ధాయిలో నీటి నిల్వ చెయ్యడం జరిగిందని చెప్పారు. నెల్లూరు జిల్లాలో ప్రతీ ఎకరానికి నీటిని అందిస్తామని హామీ ఇచ్చారు.కానీ కొంతమంది తనపై కావాలనే బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు.
No comments:
Post a Comment