Breaking News

12/10/2019

వారం రోజుల పాటు ఆందోళనలకు టీఆర్టీసీ పిలుపు

హైద్రాబాద్, అక్టోబరు 12, (way2newstv.in)
ధూం ధాం, వంటావార్పు, రాస్తారోకోలు, ర్యాలీలు, బంద్‌లు, బహిరంగ సభలతో తెలంగాణ రాష్ట్రం మరోసారి మార్మోగనుంది. వారం రోజులుగా సమ్మెలో ఉన్న ఆర్టీసీ ఉద్యోగులు తమ పోరాటాన్ని ఉధృతం చేస్తూ భవిష్యత్ కార్యాచరణ ప్రకటించారు. శనివారం  విపక్ష పార్టీలతో మరోసారి భేటీ అయిన ఆర్టీసీ జేఏసీ నాయకులు అనంతరం సమ్మె షెడ్యూల్ ప్రకటించారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన అఖిల పక్ష భేటీ అనంతరం మీడియాతో మాట్లాడారు.తమ ఆందోళనలో భాగంగా ఆదివారం నుంచి వారం రోజుల పాటు వివిధ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆర్టీసీ జేఏసీ నేతలు వెల్లడించారు. 13న వంటావార్పు, 14న బహిరంగ సభలు, 15న రాస్తారోకోలు, మానవహారం, 16న ర్యాలీలు, 17న ధూం ధాం, 18న బైక్ ర్యాలీలు చేపట్టనున్నారు. 
వారం రోజుల పాటు ఆందోళనలకు టీఆర్టీసీ పిలుపు

19న తెలంగాణ రాష్ట్ర బంద్‌కు ఆర్టీసీ జేఏసీ పిలుపునిచ్చింది. 19న బంద్‌కు పిలుపు ఇవ్వనున్నట్లు ఇంతకుముందే తెలిపారు. అందుకు అనుగుణంగా కార్యాచరణ ప్రకటించారు.ధూం ధాం, మానవహారం, సకల జనుల సమ్మె, ర్యాలీలు, రాస్తారోకోలు తదితర కార్యక్రమాలు తెలంగాణ ఉద్యమ సమయంలో ఊపు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఆర్టీసీ కార్మికుల సమ్మెతో రాష్ట్రంలో మళ్లీ ఉద్యమ కాలం నాటి రోజులు గుర్తుకు రానున్నాయి.మరోవైపు.. ఆర్టీసీ కార్మికులు సమ్మెను ఉధృతం చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు సిద్ధమైంది. విద్యా సంస్థలకు దసరా సెలవులను ఈ నెల 19 వరకు పొడగిస్తూ నిర్ణయం తీసుకుంది. స్కూళ్లు, కాలేజీల బస్సులను ప్రయాణికుల తరలింపునకు వినియోగించనున్నారు. అదనపు బస్సులను సమకూర్చుకోవాలని అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.
ఆర్టీసీ జేఏసీ కార్యాచరణ ఇదే..
13న వంటావార్పు
14న ఆర్టీసీ డిపోల ముందు బైఠాయింపు, ఇందిరా పార్క్ వద్ద బహిరంగసభ
15న రాస్తారోకోలు, మానవహారం
16న ఉద్యోగులు, విద్యార్థుల ర్యాలీలు
17న ధూం ధాం
18న బంద్ కోసం బైక్ ర్యాలీలు
19న తెలంగాణ బంద్

No comments:

Post a Comment