Breaking News

25/10/2019

హాట్ హాట్ గా డెల్టా పాలిటిక్స్

రాజుల మధ్య పెరుగుతున్న దూరం
ఏలూరు, అక్టోబర్ 25(way2newstv.in)
రాజ‌కీయాల్లో టిక్కెట్లు సంపాయించుకోవ‌డం ప్ర‌జాక్షేత్రంలో గెల‌వ‌డం, అధినేత ద‌గ్గ‌ర మంచి మార్కులు కొట్టేయ‌డం ఒక భాగం. అయితే, తాము ప్రాతినిధ్యం వ‌హిస్తున్న నియోజ‌క‌వ‌ర్గం స‌హా కుదిరితే జిల్లా మొత్తంగా ఆధిప‌త్యం సాధించాల‌నే ఆశ‌లు పెట్టుకోవ‌డం, దానికి త‌గిన విధంగా అడుగులు వేయ‌డం మ‌రో భాగం. ఇప్పుడు ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని వైసీపీ నేత‌లు ఆధిప‌త్య రాజ‌కీయాల్లో మునిగి తేలుతున్నారు. ముఖ్యంగా పౌరుషానికి పోయే రాజుల సామాజిక వ‌ర్గానికి చెందిన ఇద్ద‌రు నాయ‌కులు ఆధిప‌త్య పోరులో ముందున్నారు. త‌మ మాటే నెగ్గాల‌ని, నియోజ‌క‌వ‌ర్గాలు స‌హా జిల్లాలోనే త‌మకు తిరుగులేని రాజ‌కీయాలు సాగాల‌ని ఈ ఇద్ద‌రు నాయ‌కులు పోటీ ప‌డుతున్నార‌ట. 
హాట్ హాట్ గా డెల్టా పాలిటిక్స్

ఈ విష‌యం ఇప్పుడు డెల్టా పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.ఈ క్ర‌మంలోనే ఒక‌రిపై ఒక‌రు పైచేయి సాధించేందుకు పొలిటిక‌ల్ గా చ‌క్రం తిప్పుతున్నారు. మ‌రి వీరు ఎవ‌రు? వీరు చేస్తున్న రాజ‌కీయాలు ఏంటి? చూద్దాం! ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో ప‌శ్చిమ‌గోదావ‌రిలో రెండు నియోజ‌క‌వ‌ర్గాలు మిన‌హా వైసీపీ అన్ని నియోజకవర్గాలను గెలుచుకుంది.. ఈ క్ర‌మంలోనే ఆచంట నుంచి రైస్ మిల్ల‌ర్స్ అసోసియేష‌న్ జిల్లా అధ్య‌క్షుడు చెరుకువాడ శ్రీరంగ‌నాథ‌రాజు వైసీపీ టికెట్‌పై పోటీ చేసి విజ‌యం సాధించారు. ఎన్నిక‌ల‌కు ముందు జ‌గ‌న్ నిర్వహించిన ప్ర‌జాసంక‌ల్ప పాద‌యాత్ర‌లో పార్టీ కండువా క‌ప్పుకొన్న చెరుకువాడ అనూహ్యంగా వైసీపీ టికెట్‌ను సొంతం చేసుకుని విజ‌యం సాధించారు.ఇక‌, వైసీపీలో కీల‌క నేత‌, పార్టీ పెట్టిన‌ప్ప‌టి నుంచి జ‌గ‌న్‌కు అత్యంత న‌మ్మ‌క‌స్తుడిగా ఉన్న ముదునూరి ప్ర‌సాద‌రాజు కూడా ఇదే జిల్లాలోని న‌ర‌సాపురం నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజ‌యం సాధించారు. వాస్త‌వానికి ఈయ‌న 2012 ఉప ఎన్నిక‌ల్లోనే కాంగ్రెస్‌కు రాజీనామా చేసి వైసీపీలో చేరారు. ఆ స‌మ‌యంలో ఆయ‌న ఓట‌మి పాల‌య్యారు. అయిన‌ప్ప‌టికీ.. పార్టీలోనే ఉంటూ వ‌చ్చారు. జ‌గ‌న్‌కు అత్యంత న‌మ్మ‌క‌స్తుడిగా ఎదిగారు. ఇక‌, 2014 ఎన్నిక‌ల్లో ఆయ‌న త‌న సీటును త్యాగం చేసి వెళ్లి ఆచంట నుంచి పోటీ చేశారు. అయితే, అక్క‌డ టీడీపీ నాయ‌కుడు పితాని స‌త్య‌నారాయ‌ణ చేతిలో ఓడిపోయారు. ఇక‌, ఇప్పుడు న‌ర‌సాపురం నుంచి విజ‌యం సాధించారు.ఇదిలావుంటే, జ‌గ‌న్ మంత్రి వ‌ర్గంలో ముదునూరికి చోటు ద‌క్కుతుంద‌ని అంద‌రూ అనుకున్నారు. ఆయ‌న‌కు జ‌గ‌న్‌కు అత్యంత స‌న్నిహితుడు కావ‌డంతోపాటు వైసీపీలో కీల‌కంగా ఉండ‌డంతో బెర్త్ ఖాయ‌మ‌ని అనుకున్నారు. అయితే, మ‌ధ్య‌లో వ‌చ్చిన చెరుకువాడ మాత్రం జిల్లాలోని కీల‌క‌మైన పెద్ద రాజుల సిఫార‌సుల‌తో జ‌గ‌న్‌ను మ‌చ్చిక చేసుకుని మంత్రి వ‌ర్గంలో బెర్త్ కొట్టేశారు. దీంతో త‌న‌కు రావాల్సిన బెర్త్‌ను చెరుకువాడ సొంతం చేసుకోవ‌డం ముదునూరి ఎంతైనా అసంతృప్తితో ఉన్నారు. ఈ క్ర‌మంలోనే ఇద్ద‌రి మ‌ధ్య రాజ‌కీయంగా పైచేయి సాధించాల‌నే వ్యూహాలు తెరమీదికి వ‌చ్చాయి. ఇక‌, వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి త‌న‌కు పోటీ లేకుండా చూసుకునేందుకు మంత్రి చెరుకువాడ పెద్ద వ్యూహ‌మే ప‌న్నారు.ఇందులో భాగంగా ఆయ‌న ఆచంట నుంచి టీడీపీ త‌ర‌ఫున పోటీ చేసి ఓడిన పితాని స‌త్య‌నారాయ‌ణ‌ను వైసీపీలోకి తీసుకు వ‌చ్చి పాల‌కొల్లు ప‌గ్గాలు అప్ప‌గిస్తే.. త‌న‌కు భవిష్యత్తు లో థ్రెట్ ఉండ‌ద‌ని చెరుకువాడ భావించారు. దీనికి త‌గిన‌ట్టే ఆయ‌న అడుగులు వేస్తున్న క్ర‌మంలో ముదునూరు వ్యూహాత్మ‌కంగా అడుగులు వేశారు. ప్ర‌సాద‌రాజు.. త‌న శిష్యుడైన శెట్టిబ‌లిజ వ‌ర్గానికి చెందిన కౌరు శ్రీనివాస్‌ను తీసుకొచ్చి జ‌గ‌న్‌ను ఒప్పించి పాల‌కొల్లు ఇంచార్జ్‌ని చేశారు. ఇదే కౌరు శ్రీనివాస్ ఎన్నిక‌ల‌కు ముందు వ‌ర‌కు ఆచంట వైసీపీ ఇన్‌చార్జ్‌గా ఉన్నారు. చెరుకువాడ కోసం జ‌గ‌న్ చెప్పిన‌ట్టు త‌న సీటు త్యాగం చేశారు. ఇప్పుడు అదే కౌరుకు చెరుకువాడ చెక్ పెట్టి పితానికి పాల‌కొల్లు ప‌గ్గాలు ఇవ్వాల‌ని చూస్తే అనూహ్యంగా ప్ర‌సాద‌రాజు చ‌క్రం తిప్పి కౌరుకు పాల‌కొల్లు ప‌గ్గాలు ద‌క్కేలా చేశారు. వాస్త‌వానికి ప్ర‌సాద‌రాజుకు మంత్రి ప‌ద‌వి ఇవ్వాలి. అయ‌తే, పెద్ద రాజుల ప్రాబ‌ల్యంతో చెరుకువాడ సీటు తెచ్చుకున్నాడు. కానీ, రెండేళ్ల త‌ర్వాతైనా ప్ర‌సాద‌రాజుకు ఇవ్వాలి. కానీ, ఇప్ప‌టి నుంచే ఈ ఇద్ద‌రి మ‌ధ్య ఉప్పు-నిప్పు రాజ‌కీయాలు సాగుతుండ‌డంతో ప‌శ్చిమ వైసీపీలో రాజుల మ‌ధ్య వార్ ఎటు దారితీస్తుందోన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

No comments:

Post a Comment