Breaking News

17/06/2019

ఇదేనా బీజేపీ క్రమశిక్షణ..


హైదరాబాద్ జూన్ 17 (way2newstv.in)
రోజు వంద మంది మాతో టచ్ లో ఉంటున్నారని నిస్సిగ్గుగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం బీజేపీ సిగ్గుమాలిన చర్య అని టీపీసీసీ కార్య నిర్వాహక అధ్యక్షులు పొన్నం ప్రభాకర్ అన్నారు. సోమవారం అయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ చేసిన ప్రకటనపై ఆయన మండి పడ్డారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికలలో రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ తో సహా ఒక్కరు తప్ప ఎమ్యెల్యే అభ్యర్థులు అంత ఒడిపోయారని ఆలాంటి పార్టీ ఏదో అనుకోకుండా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిని పోటీకి నిలిపి 4 ఎంపీ సీట్లు గెలిచిందని ఆయన అన్నారు.  


ఇదేనా బీజేపీ క్రమశిక్షణ.. 

103 అసెంబ్లీ స్థానాలలో కనీసం డిపాజిట్లు కూడా సాధించలేని బీజేపీ ని రాష్ట్రంలో రాజకీయ శక్తి కాలేదని అన్నారు. కాంగ్రెస్ ను కుట్రతో ఓడించి అన్ని రకాలుగా దుర్వినియోగాలకు పాల్పడిన బీజేపీ ఇప్పుడు రాజకీయ ఫిరాయింపులను ప్రోత్సహిస్తుందని అన్నారు.  లక్ష్మణ్ కు వారి పార్టీ బలం పైన నమ్మకం ఉంటే పార్టీ మారిన వారి చేత రాజీనామా చేయించాలని అప్పుడు ఎన్నికలలో ఎవరు గెలుస్తారో, ఎవరు ఊడుతారో తెలుతుందని అన్నారు..పదవులు, డబ్బులు, అధికారం ఆశ చూపి ఇతర పార్టీ ల నాయకులను బీజేపీ లో చేర్చుకుంటున్నారని బీజేపీ ప్రస్తుత నాయకులకు పార్టీని నడిపే సత్తా లేదు, అందుకే ఇతర పార్టీ నాయకులను బీజేపీ లోకి ఆహ్వానిస్తున్నారని ఆయన విమర్శించారు.  బీజేపీ లోకి పోతున్నట్టు కాంగ్రెస్ నాయకుల పేర్లు పత్రికలలో, టివి చానల్స్ లో వచ్చిన వారు వెంటనే ఆ వార్తలను ఖండించాలని ఆయన అన్నారు. 

No comments:

Post a Comment