Breaking News

25/10/2019

కాంగ్రెస్ కు ఊపిరి పోసిన రెండు రాష్ట్రాల ఎన్నికలు

న్యూఢిల్లీ, అక్టోబరు 25 (way2newstv.in)
హర్యానాలో మోదీ, షాల ప్రయోగం వికటించిందనే చెప్పాలి. ప్రధాన సామాజిక వర్గం వీరిపై ఆగ్రహం వ్యక్తం చేయడం వల్లనే బీజేపీకి హర్యానాలో ఎదురుగాలి వీచిందన్నది విశ్లేషకుల అంచనా. తొలి నుంచి హర్యానాపై బీజేపీ ఆశలు భారీగానే పెట్టుకుంది. భారతీయ జనతా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా హర్యానపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. మిషన్ 75 నినాదంతో ప్రచార బరిలోకి దిగారు. ఢిల్లీకి ఆనుకునే ఉండే రాష్ట్రం కావడంతో 307 అధికరణ రద్దు తమకు అనుకూలం అవుతుందని కమలనాధులు భావించారు.కానీ ఫలితాలు చూసి అవాక్కవ్వాల్సి వచ్చింది. నలభై స్థానాలకు మించలేదు. ప్రధాని మోదీ, అమిత్ షా ప్రచార పర్వంలో పాల్గొన్నారు. ఇక్కడ గతంలో జాట్ సామాజికవర్గాన్ని కాదని బీసీ వర్గానికి చెందిన మనోహర్ లాల్ ఖట్టర్ ను ముఖ్యమంత్రిగా నియమించారు. 
కాంగ్రెస్ కు  ఊపిరి పోసిన రెండు రాష్ట్రాల ఎన్నికలు

ఇప్పుడు కూడా ఆయన సారథ్యంలోనే ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించడంతో పాటు ఆయననే ముఖ్యమంత్రి అభ్యర్థిగా బీజేపీ ప్రకటించింది. అంటే హర్యానాపై ఎంత విశ్వాసంతో కమలనాధులున్నారన్నది దీన్ని బట్టి అర్థమవుతుంది.బీజేపీ తన అధికారాన్ని నిలుపుకోవడానికి కిందా మీదా పడితే హర్యానాను కాంగ్రెస్ అగ్రనేతలు ఎవరూ పట్టించుకోక పోవడం విశేషం. హర్యానాలో కాంగ్రెస్ తరుపున ప్రచారానికి సోనియాగాంధీ, రాహుల్, ప్రియాంక గాంధీలు రాలేదు. మొత్తం బాధ్యతను అక్కడ పీసీసీ అధ్యక్షురాలు కుమారి సెల్జాపై ఉంచారు. అలాగే మాజీ ముఖ్యమంత్రి భూపేందర్ హుడా కూడా అభ్యర్థుల ఎంపికలోనూ కీలక పాత్ర పోషించారు. ఎన్నికలకు ముందే హర్యానా కాంగ్రెస్ లో పెద్దయెత్తున విభేదాలు తలెత్తాయి. అగ్రనేతలు పార్టీని విడిచి పెట్టి వెళ్లిపోయారు. దీంతో కాంగ్రెస్ హర్యనాలో ముందుగానే చేతులెత్తేసిందని అందరూ భావించారు.కానీ కాంగ్రెస్ ఒకరకంగా హర్యానాలో గెలిచి ఓడిందనే చెప్పాలి. కాంగ్రెస్ 90 స్థానాల్లో 32 స్థానాలను దక్కించుకోవడంతో ఆ పార్టీ ఓటు బ్యాంకు ఇంకా పటిష్టంగా ఉందనే చెప్పాలి. అగ్రనేతలెవరూ ప్రచారం చేయకపోయినా కాంగ్రెస్ ఇన్ని స్థానాలు సాధిండం వెనక బీజేపీపై వ్యతిరేకత ఉందని కూడా చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఎవరు ఏర్పాటు చేసినా కాంగ్రెస్ మాత్రం హర్యానా ఫలితాలు తిరిగి ప్రాణం పోశాయనే చెప్పాలి. క్యాడర్ లో కూడా ఈ ఫలితాలు ఉత్తేజాన్ని నింపుతాయని చెప్పుకోక తప్పదు. 29 శాతం ఉన్న జాట్ సామాజికవర్గాన్ని దూరం చేసుకోవడమే ఈ ఫలితాలు నిదర్శనమంటున్నారు

No comments:

Post a Comment