Breaking News

02/12/2019

ఆశాజనకంగా ఆ ఆరు స్థానాలేనా

బెంగళూర్, డిసెంబర్ 2 (way2newstv.in)
కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్పకు బెంగపట్టుకుంది. పదిహేను నియోజవర్గాల్లో ఎనిమిది స్థానాల్లో ఖచ్చితంగా గెలవాల్సి ఉంది. ఎనిమిది స్థానాలను గెలుచుకుంటేనే పూర్తి కాలం అధికారంలో యడ్యూరప్ప ఉంటారు. అందుకోసం యడ్యూరప్ప పదిహేను నియోజకవర్గాల్లో గెలిచేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నారు. ప్రచారం మొత్తం తానే దగ్గరుండి చూసుకుంటున్నారు. అంతేకాకుండా రెబెల్స్ మాట వినకపోతే పార్టీ నుంచి బహిష్కరిస్తున్నారు.అయితే తాజా లెక్కల ప్రకారం భారతీయ జనతా పార్టీకి కేవలం నాలుగు నియోజకవర్గాల్లోనే పరిస్థితి ఆశాజనకంగా ఉన్నట్లు తేలింది. మిగిలిన 11 నియోజకవర్గాల్లో మూడో స్థానం, రెండోస్థానంలో ఉండేలా సర్వే నివేదికలు అందినట్లు తెలిసింది. 
ఆశాజనకంగా ఆ ఆరు స్థానాలేనా

అభ్యర్థులు ఖరారయిన తర్వాత నిర్వహించిన సర్వేలో కేవలం నాలుగింటిలో మాత్రమే కొంత మెరుగైన పనితీరు బీజేపీ కనపరుస్తుందన్నదిద తేలడంతో యడ్యూరప్ప డీలా పడ్డారని చెబుతున్నారు.వీటిలో విజయనగర హీరేకేరూరు, మహాలక్ష్మీ లే అవుట్, కె.ఆర్ పేటలలో మాత్రమే బీజేపీకి గెలుపు అవకాశాలున్నట్లు గుర్తించారు. మిగిలిన నియోజకవర్గాల్లో పరిస్థితి అనుకూలంగా లేదని గుర్తించారు. దీంతో యడ్యూరప్ప ఆ నియోజకవర్గాలకు ఇద్దరేసి మంత్రులను ఇన్ ఛార్జులుగా నియమించారు. వారిని సీరియస్ గా పనిచేసి గెలిపించుకుని తీసుకురావాలని యడ్యూరప్ప ఆదేశించినట్లు చెబుతున్నారు.నిజానికి అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలందరికీ టిక్కెట్లు ఇస్తామని ప్రకటించినప్పుడే గెలుపు కష్టమని తేలింది. విశ్లేషకులు సయితం ఇదే అంచనా వేశారు. పార్టీ మారిన నేతలను తిరిగి గెలిపించడం కష్టమేనన్న విషయం ఇటీవల జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో చూశాం. కర్ణాటకలో కూడా దాదాపు అన్ని స్థానాల్లో అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలు ఎదురీదుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వారిలో గెలిస్తే ఇద్దరు ముగ్గురు తప్ప మిగిలని వారికి అవకాశం లేదంటున్నారు. మరి యడ్యూరప్ప భవిష్యత్తు ఎలా ఉంటుందో చూడాలి.

No comments:

Post a Comment