Breaking News

21/11/2019

రేషనలైజేషన్ పేరుతో మూసివేత..?

హైద్రాబాద్, నవంబర్ 21, (way2newstv.in)
కిలోమీటర్లలోపు అప్పర్‌‌ ప్రైమరీ, ఐదు కిలోమీటర్లలోపు హైస్కూల్‌‌ ఉండాలనే రూల్స్ ఉండగా.. ఇప్పుడవన్నీ మార్చేసి ఏ బడి అయినా ఐదు కిలోమీటర్లలోపు ఒకటి ఉంటే సరిపోతుందన్న సవరణ తేవాలని సర్కారు యోచిస్తోంది.దీనిపై విద్యా శాఖ ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేయగా.. పూర్తిస్థాయి అధ్యయనం కోసం ఐదుగురు సభ్యులతో స్కూల్‌‌ ఎడ్యుకేషన్‌‌ కమిషనర్‌‌ విజయ్‌‌కుమార్  కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ ఈనెల 22వ తేదీన డైరెక్టరేట్‌‌ ఆఫ్‌‌ స్కూల్‌‌ ఎడ్యుకేషన్‌‌లో సమావేశమై, ‘ఐదు కిలోమీటర్లకో స్కూల్’ అంశంపై చర్చించనుంది. అలా మార్చితే ప్రభావం ఎలా ఉంటుందన్న దానిపై సర్కారుకు రిపోర్టు అందించనుంది.రాష్ట్రంలో మొత్తం 26,090 ప్రభుత్వ స్కూళ్లు ఉండగా.. అందులో ప్రైమరీ స్కూళ్లు 18,217, అప్పర్‌‌ ప్రైమరీ స్కూళ్లు 3,186, హైస్కూళ్లు 4,687  ఉన్నాయి.
రేషనలైజేషన్ పేరుతో మూసివేత..?

ఒక్క స్టూడెంట్‌‌ లేని బడులు 916 ఉన్నాయి. 3,467 బడుల్లో 15 మందిలోపే స్టూడెంట్లున్నారు. ఇందులో అప్పర్‌‌ ప్రైమరీ, ప్రైమరీ స్థాయిలో 3,445 స్కూళ్లుండగా, 22 హైస్కూళ్లు ఉన్నాయి.ఇక 16 నుంచి 100 మందిలోపు స్టూడెంట్లున్న ప్రైమరీ, యూపీఎస్‌‌ల సంఖ్య 14,138. ఇందులో హైస్కూళ్లు 1,397, ప్రైమరీ, అప్పర్ప్రైమరీ స్కూళ్లు 2,675 ఉన్నాయి.1,985 హైస్కూళ్లలో 250 మంది వరకు స్టూడెంట్స్ఉన్నారు.237 ప్రైమరీ, అప్పర్‌‌ ప్రైమరీ స్కూళ్లు, 1,210 హైస్కూళ్లలో 250–వెయ్యి మంది ఉన్నారు.21 హైస్కూళ్లు, ఒక యూపీఎస్లో వెయ్యికి పైగా స్టూడెంట్స్‌‌ ఉన్నారు.రాష్ట్రంలో మొత్తం 26,090 స్కూళ్లు ఉండగా.. వాటిలో ప్రైమరీ స్కూళ్లు 18,217, అప్పర్‌‌ ప్రైమరీ స్కూళ్లు 3,186, హైస్కూళ్లు 4,687  ఉన్నాయి. వీటిలో సుమారు 25 లక్షల మంది చదువుతున్నారు. అయితే స్టూడెంట్ల సంఖ్య తక్కువగా ఉంటోందన్న ఉద్దేశంతో బడుల మూసివేత కోసం నాలుగైదేండ్లుగా ప్రయత్నిస్తోంది. ఇప్పటికే పలుమార్లు రేషనలైజేషన్ పేరిట.. తక్కువ మంది ఉన్న బడుల్లోని స్టూడెంట్లను, టీచర్లను సమీపంలోని స్కూళ్లలో సర్దుబాటు చేసింది. అయితే స్కూళ్ల మూసివేతకు విద్యాహక్కు చట్టం అడ్డంకిగా మారింది. అయితే ఆయా రాష్ట్రాలకు అనుగుణంగా కొన్ని సవరణలు చేసుకోవచ్చని విద్యా హక్కు చట్టంలో వెసులుబాటు ఉండటంతో.. రాష్ట్ర సర్కారు దాన్ని వినియోగించుకోవాలని నిర్ణయించింది.వివిధ హ్యాబిటేషన్‌‌  ఏరియాల(నివాస ప్రాంతాల)కు ఉన్న అర్థాన్ని మారుస్తూ ఐదు కిలోమీటర్లలోపు ప్రైమరీ, యూపీఎస్‌‌, హైస్కూల్‌‌ ఉంటే సరిపోతుందన్న సవరణకు సర్కారు సిద్ధమైంది. ఇందుకోసం హైదరాబాద్‌‌ ఆర్జేడీ, హైదరాబాద్‌‌, రంగారెడ్డి జిల్లాల డీఈవోలు, డిప్యూటీ డీఈవో హైదరాబాద్‌‌, రంగారెడ్డి ఎంఈవోతో పాటు సమగ్ర శిక్షా అభియన్‌‌ నుంచి ఒక ప్రతినిధితో ఒక కమిటీని వేసింది. ఆ కమిటీ ఈ నెల 22వ తేదీన ఉదయం 11గంటలకు డీఎస్‌‌ఈలోని అడిషనల్‌‌ డైరెక్టర్‌‌ (సీ) చాంబర్‌‌లో సమావేశం కావాలని నిర్ణయించారు. విద్యాహక్కు చట్టానికి సవరణలు చేస్తే.. ఎలాంటి పరిణామాలు వస్తాయనే దానిపై చర్చించి, సర్కారుకు నివేదిక అందించనున్నారు.మరో వైపు సర్కారు నిర్ణయంతో పేదలకు విద్య దూరమవుతుందని టీఎస్‌‌యూటీఎఫ్‌‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సీహెచ్‌‌  రాములు, చావ రవి పేర్కొన్నారు. సర్కారీ విద్యను దెబ్బతీసే కుట్రలో భాగంగానే ఐదు కిలోమీటర్లకో స్కూల్ అన్న ప్రతిపాదన తెచ్చారని ఆరోపించారు. వెంటనే ఈ నిర్ణయాన్ని ఉప సంహరించుకోవాలని, లేకుంటే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

No comments:

Post a Comment