Breaking News

31/10/2019

వారి ఇంట్లోనే పాము పుట్టలు

విశాఖపట్నం అక్టోబర్ 31,(way2newstv.in):
నాగుల చవితి వచ్చిందంటే,  పుట్ట వద్దకు వెళ్లి పాలు సమర్పించడం సాంప్రదాయం. కానీ అక్కడి సాంప్రదాయాలు మాత్రం కాస్తా విభిన్నం. పేరుకు ఏజెన్సీ అయినా సరే ఎన్నో ఏళ్లుగా వస్తున్న ఆచారాన్ని కొనసాగింపుగా ఇంట్లోనే పాము పుట్టలను ఏర్పాటు చేసి పూజిస్తున్నారు.  ప్రత్యేకించి శివరాత్రి వచ్చిందంటే అక్కడ జాతర జరుగుతుందటే సమ్మాల్సిందే.పాడేరు విశాఖ ఏజెన్సీలో ఓ భాగం. అక్కడ విభిన్న జాతుల సమాహారంగా గిరిజనలు, కొండ కోనల్లో నివసించే వాళ్లే ఎక్కువ. 
వారి ఇంట్లోనే పాము పుట్టలు

అయితే తుమ్మరపెట్ట గ్రామానికి మాత్రం ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడ నివసిస్తున్న ఒ కుటుంబానికి చెందిన కొంత మంది ఇంట్లోనే పుట్టను ఏర్పాటు చేసి నాగేంద్రుడిని కొలుస్తున్నారు. చుట్టపక్కల గ్రామ ప్రజలు కూడా వీరి సాంప్రదాయంపై ఉన్న నమ్మకంతో దర్శించుకునేందుకు వస్తుంటారని సమాచారం. అయితే వీరిలో ఎనిమిది కుటుంబాలు ఈ సంస్కృతిని కొనసాగిస్తున్నారంటే ... దీని వేనుక సుమారుగా 35 ఏళ్ల చరిత్ర ఉందని తెలుస్తోంది. అప్పటి నుంచి ఇంట్లోనే పుట్ట పెట్టుకొని వస్తున్నారు. కాలక్రమేణా మహిళలు కూడా ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. అయితే శివరాత్రి రోజున ఇక్కడ జాతర తరహాలో పండుగను నిర్వహిస్తారని సమాచారం. ఈ ప్రత్యేక సంస్కృతి విశాఖ ఏజెన్సీని పతాక శీర్షికలో నిలిచేలా చేస్తోంది.

No comments:

Post a Comment