Breaking News

22/10/2019

గ్యాస్ సిలెండర్లలో కొత్త మోసం

హైద్రాబాద్, అక్టోబరు 22, (way2newstv.in)
గ్యాస్ సిలిండర్లలో నీటిని నింపుతున్న లారీ డ్రైవర్ గుట్టురట్టైంది. డీలర్లకు సప్లయ్ చేసే గ్యాస్ సిలిండర్స్ లో నీటిని నింపి మోసాలకు పాల్పడుతున్న నిందితుడిని కీసర పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి దగ్గరి నుంచి 4 ఖాళీ సిలిం డర్స్ తో పాటు గ్యాస్ రీ ఫిల్లింగ్ సామగ్రిని స్వాధీనంచేసుకున్నారు. ఇన్ స్పెక్టర్ నరేందర్ గౌడ్ కేసు వివరాలువెల్లడిం చారు. కీసర పీఎస్ పరిధిలోని మల్లాపూర్ లోఅశోక్ నగర్ కి చెందిన గొల్లూరి రాజు గ్యాస్ సిలిండర్స్ ట్రాన్స్ పోర్ట్ చేసేందుకు లారీ కొన్నాడు. తనే డ్రైవర్గా పనిచేస్తూ రెండేళ్ళుగా సిటీతో పాటు శివారు ప్రాంతాల్లోని గ్యాస్ డీలర్లకు సిలిండర్లను సప్లయ్ చేస్తున్నాడు. చర్లపల్లిలోని హెచ్.పీ.సీ.ఎల్ గ్యాస్ ప్లాంట్ నుంచిఆర్డర్స్ పై సిలిండర్స్ తరలిం చే వాడు. ప్లాంట్ నుంచి సంబంధిత డీలర్స్ కు ఫుల్ సిలిండర్స్ లోడ్ ట్రాన్స్ పోర్ట్చేస్తూ ఖాళీ సిలిండర్లను తిరిగిప్లాంట్ కి తరలించేవాడు. ఇలా నెలలో 20కి పైగా గ్యాస్ సిలిండర్ ట్రిప్స్ డీలర్స్ కు చేరవేసేవాడు. 
గ్యాస్ సిలెండర్లలో కొత్త మోసం

రాజు తన ఇంట్లో వంట గ్యాస్ ఖాళీ అయిన సందర్భాల్లో తన లారీ లోడ్ లోని సిలిండర్స్ ను డీలర్స్ కి తెలియకుండా వాడేవాడు. ఫుల్ సిలిండర్ ప్లేస్లో ఖాళీ సిలిండర్ పెట్టి గోడౌన్ లో అన్ లోడ్ చేసేవాడు.ఈ క్రమంలో గ్యాస్ రీ ఫిల్లింగ్ పై రాజు అవగాహన పెంచుకున్నాడు. రీ ఫిల్లింగ్ కు ఉపయోగించే పైప్స్, వెయిం గ్మీటర్స్ ను కొన్నాడు. సిలిండర్ వాల్వ్ ఓపెన్ చేసేం దుకుకావాల్సిన సామగ్రి సేకరించాడు. తనకు వచ్చే ఆర్డర్స్ తో ఖాళీ సిలిండర్స్ లోడ్ తీసుకుని చర్లపల్లి ప్లాంట్ కువెళ్ళేవాడు. ఫుల్ సిలిండర్స్ లోడ్ చేసుకున్న తరువాత నిర్ధేశించిన డీలర్ల గోడౌన్లకు తరలించేవాడు. ఇందులో తన స్కెచ్ లో భాగంగా సిలిండర్స్ లోడ్ లారీని గోడౌన్ కి కాకుండా అశోక్ నగర్ లోని తన ఇంటికి తీసుకువచ్చేవాడు. ఎవరికి అనుమానం రాకుండా లారీలో నుంచి 2 నుం చి 4 ఫుల్ సిలిండర్స్ ని తన ఇంటికి చేర్చేవాడు. ఇలా ఇంటికి తీసుకెళ్ళిన ఫుల్ సిలిండర్స్ లో ఉన్న గ్యాస్ ను అప్పటికే ఇంట్లో నిల్వ ఉంచిన ఖాళీ సిలిండర్స్ లో రీఫిల్ చేసేవాడు. అందుకోసం ఒక్కో ఖాళీ సిలిండర్లో ముందుగానే సుమారు 60శాతం నీటిని నింపి ఉంచేవాడు. ఆ తర్వాత ఫుల్ సిలిండర్ సీల్ ను జాగ్రత్తగా ఓపెన్ చేసి అందులో నుం చి 40శాతం గ్యాస్ ను నీటితో ఉన్న ఖాళీ సిలిండర్ లోకి రీఫిల్ చేసేవాడు. ఇలా 60 శాతం నీరు 40 శాతం గ్యాస్ నిండి ఉన్న సిలిండర్ ను మళ్ళీ సీల్ చేసి తన లారీలో గోడౌన్ కి తరలించేవాడు. ఒక్కో లోడ్ లారీలో వందల సంఖ్యలో సిలిండర్స్ ఉండడంతో గోడౌన్ నిర్వాహకులు అలాంటి సిలిండర్లను గుర్తించేవారు కాదు. ఇలా రీఫిల్ చేసిన సిలిండర్స్ ను బ్లాక్ లో రాజు అమ్మేవాడు. ఏడాది కాలంగా రాజు నిర్వహిస్తున్న దందా డీలర్లకు కస్టమర్లు చేసిన కంప్లయింట్ తో బయటపడింది.కీసరలోని శ్రీ రామలిం గేశ్వర గ్యాస్ ఏజెన్సీకి చెందినసిలిండర్స్ త్వరగా ఖాళీ అవుతుండడంతో పలువురు కస్టమర్లు సిలిండర్స్ పరిశీలించారు. గ్యాస్ డెలివరీ జరిగిన వారం రోజుల్లోనే సిలిండర్స్ ఖాళీ కావడంతో అనుమానం వచ్చి చెక్ చేశారు. వాల్వ్ నుంచి నీరు బయటకి రావడంతో డీలర్ కి సమాచారం అందించారు. దీంతో తనకు సప్లయ్ అవుతున్న రాజు గ్యాస్ సిలిండర్ లోడ్ పై డీలర్ వెంకటేశ్వర రెడ్డి నిఘా పెట్టాడు. అన్లోడ్ చేసేందుకు వచ్చిన రాజు లారీలోని ఒక్కో సిలిండర్ ను చెక్ చేశారు. దీంతో సీల్ ఓపెన్ చేసి నీటితో నింపిన మూడు సిలిండర్స్ బయట పడ్డాయి. డీలర్ వెంకటేశ్వర రెడ్డితో పాటు హెచ్.పీ.సీ.ఎల్ ప్రతినిధులు ఇచ్చిన కంప్లయింట్ తో కీసర పోలీసులు కేసునమోదు చేశారు. రాజును అదుపులోకి తీసుకుని గ్యాస్రీఫిల్లింగ్ సామాగ్రితో పాటు 4 ఖాళీ సిలిండర్స్ స్వాధీనం చేసుకున్నారు.

No comments:

Post a Comment