Breaking News

23/10/2019

కాల్వల కాలుష్యంపై సీఎం సమీక్ష

అమరావతి అక్టోబర్ 23(way2newstv.in)
సచివాలయంలో కృష్ణా, గోదావరి కాల్వల్లో కాలుష్యం నివారణ, సుందరీకరణ, చెట్లపెంపకంపై  ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి బుధవారం సమీక్ష జరిపారు. మురుగునీటిని శుద్ధిచేసిన తర్వాతనే కాల్వల్లోకి విడిచిపెట్టాలి. గోదావరి కృష్ణా కాల్వల్లో బాగుచేయాల్సిన ప్రాంతాలను గుర్తించండి. ఎక్కడెక్కడ మురుగునీటి శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేయాలో కూడా గుర్తించండని ఆదేశించారు. 
కాల్వల కాలుష్యంపై సీఎం సమీక్ష

గోదావరి, కృష్ణా కెనాల్స్ మిషన్ను నేనే స్వయంగా పర్యవేక్షిస్తానని అన్నారు.  కాలుష్య నివారణ కార్యక్రమాల్లో విస్తృతంగా పనిచేసిన గండిపేట వెల్ఫేర్ సొసైటీ ( జీ.డబ్ల్యు.యఎస్) ప్రతినిధులను అధికారులకు పరిచయం చేసారు. కేరళలోని కన్నూర్లో చేపట్టిన కార్యక్రమాలను జీ. డబ్ల్యు.యఎస్ ప్రతినిధులు వివరించారు. దీనిపై వీడియోను ప్రదర్శించారు. కృష్ణా, గోదావరి కాల్వల శుద్ధి, అభివృద్ధి కార్యక్రమాల్లో వీరి సహాయం తీసుకోవాలన్నల సీఎం విజయవాడలో నాలుగు కిలోమీటర్ల పొడవునా కాల్వను పైలట్ ప్రాజెక్టు కింద అభివృద్ధిచేస్తామని అన్నారు.

No comments:

Post a Comment