Breaking News

09/10/2019

కరెంట్ కష్టాలకు ఫుల్ స్టాపే

హైద్రాబాద్, అక్టోబరు 9, (way2newstv.in)
ఆరు నెలల్లోనే విద్యుత్ సంక్షోభాన్ని పరిష్కరించి ఇప్పు డు నిరంతర కరెంటు సరఫరా చే కీర్తిని దక్కించుకుంది. దేశంలోనే రైతులకు 24 గంటల పాటు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ చరిత్రలో నిలిచింది.  దేశంలోనే ఏ రాష్ట్రం ఇవ్వని తీరులో 24 గం టలూ ఉచితంగా వ్యవసాయ రంగానికి విద్యుత్‌ను ఇచ్చే రాష్ట్రంగా ప్రత్యేక గుర్తింపు పొందింది. కుల, మత, ప్రాంతీయ తేడాలు లేకుండా రాజకీయాలకు అతీతంగా పేద, ధని క అనే వ్యత్యాసం లేకుండా రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాం తాల్లోని ప్రజలు ఒకే తరహాలో ఈ ఫలాలను అందుకుంటున్నారు. ఈ  ఐదున్నర ఏళ్ళలో విద్యుత్ ఛార్జీల భారం కూడా ప్రజలపై పెద్దగా పడకపోవడం, నిరంతరాయ విద్యుత్ సరఫరా ఎన్నికల్లో బలమైన ప్రభావం చూపించింది .
 కరెంట్ కష్టాలకు ఫుల్ స్టాపే

ఇక తీవ్రమైన విద్యుత్ కొరతను ఎదుర్కొంటున్న తెలంగాణకు ఒప్పందం ప్రకారం సరఫరా ఇవ్వకపోవడం టీడీపీకి మైనస్ అయింది.తెలంగాణ వచ్చిన మొదటి వారంలోనే విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు రద్దు చేసి, ఆంధ్రప్రదేశ్ సృష్టించిన అడ్డంకులను దాటి ధీటుగా ఎదురొడ్డి విజయపతాకను ఎగురవేసింది తెలంగాణ. నిత్యం కరెంటు కోతలు సాధారణమైన క్రమం నుంచి కోతలను చరిత్రలోకి పంపించింది తెలంగాణ. వచ్చిన కొన్నాళ్లలోనే విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, భవిష్యత్తు డిమాండు, అందుకు తగ్గట్లుగా తీసుకోవాల్సిన చర్యలపై రోడ్ మ్యాప్ నిర్ణయించుకొని, దాన్ని సరిగ్గా అమలు చేయడంతోనే విజయం సాధ్యమైంది. తొలుత చత్తీస్‌గఢ్‌తో 1000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని ప్రభుత్వం చేసుకుంది. నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసినందుకు గాను, విద్యుత్ ఉద్యోగులకు ప్రత్యేక ఇంక్రిమెంట్‌ను సిఎం ప్రకటించారు. వేతన సవరణకు కమిటీని నియమించారు. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు పెంచడంతో పాటు నేరుగా వేతనాలు అందించే ఏర్పాటు చేశారు. కొత్త నియామకాలు చేశారు. తెలంగాణ వచ్చే నాటికి 7778 మెగావాట్ల విద్యుత్ సామర్థం ఉండగా, ఒప్పందాలతో కలిపి ఇప్పుడు 15,380 మెగావాట్ల సామర్థం ఉంది. భద్రాద్రి పవర్ ప్లాంట్ మొదటి దశ 2018 చివరికి అందుబాటులోకి వస్తుంది. పాల్వంచ విద్యుత్ (800 మెగావాట్లు) కేంద్రం త్వరలోనే అందుబాటులోకి రానుంది. వచ్చే మూడేళ్లలో అదనంగా 14,426 మెగావాట్ల విద్యుత్ సమకూరనుంది. అవన్నీ కలిపితే 28 వేల మెగావాట్ల సామర్థంతో మిగులు విద్యుత్ రాష్ట్రంగా తెలంగాణ ఖ్యాతి గడించనుంది. ఇప్పటికే సోలార్ ఉత్పత్తిచేసే రాష్ట్రాల్లో తెలంగాణ మొదటిస్థానంలో ఉంది. 3,320 మెగావాట్ల సామర్థం ఇప్పుడు రాష్ట్రంలో అందుబాటులో ఉంది. 5,000 మెగావాట్ల సోలార్ సామర్థం లక్షంగా త్వరలోనే ఇంకో 2,000 మెగావాట్లు సోలార్ విద్యుత్‌కు టెండర్లు పిలవాలని సూత్రప్రాయంగా నిర్ణయించుకుంది. 2014, జూన్ 2న ఏకంగా 2,700 మెగావాట్ల విద్యుత్ లోటు ఉంది. ఈ లోటును అధిగమిస్తూ, పాత ప్రాజెక్టులను పూర్తిచేస్తూ, కొత్త ప్రాజెక్టులను చేపడుతూ వెలుగుల నడక సాగుతోంది. ఈ నాలుగేళ్లలో సింగరేణి నుంచి 1200 మెగావాట్లు, భూపాలపల్లి ప్లాంటు నుంచి 800 మెగావాట్లు, జూరాల నుంచి 240 మెగావాట్ల జలవిద్యుత్, పులిచింతల నుంచి 30 మెగావాట్ల విద్యుత్ సామర్ధం రాష్ట్రానికి అందుబాటులోకి వచ్చింది. వచ్చే రెండు, మూడేళ్లలో మరో 14,000 మెగావాట్ల సామర్ధం సమకూరేలా విద్యుత్ సంస్థలు ప్రణాళికలు రూపొందించాయి. ఇందులో యాదాద్రి ప్లాంట్ 4000 మెగావాట్లు, ఎన్టీపిసి ప్లాంట్ 4000 మెగావాట్లు కూడా ఉన్నాయి. కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులను డిస్కంలలో విలీనం చేసుకున్నాయి.

No comments:

Post a Comment