విజయవాడ, ఆక్టోబరు 15 (way2newstv.in)
వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్ పథకానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టారు. నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచలం మండలం కాకుటూరులోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ ప్రాంగణంలో సీఎం ప్రారంభించారు. అన్నదాతలకు అండగా రైతు భరోసాను అందజేస్తామని పాదయాత్రలో భాగంగా నెల్లూరు జిల్లాలో ప్రకటించారు. ఇచ్చిన మాటను అమలు చేస్తూ నెల్లూరు జిల్లా నుంచే పథకాన్ని ప్రారంభించారు.రైతు భరోసా కింద రూ. 12,500కు మరో వెయ్యి పెంచి రూ. 13,500 పెట్టుబడి సాయంగా రైతులకు అందజేస్తున్నారు. జూన్‌లో రూ. 2000 ఇప్పటికే అందించారు.. మరో రూ. 9,500 అక్టోబర్ నెలలో జమచేస్తారని.. మరో రూ. 2000 సంక్రాంతికి అందించనున్నారు.
రైతు భరోసాపై వైసీపీ మాట తప్పింది : బుద్ధా వెంకన్న
అంతేకాదు మరో 3 లక్షలమంది కౌలు రైతులకు రైతు భరోసాను అందజేస్తారు. ఈ పథకం ప్రారంభించి నాలుగైదు గంటలు కూడా గడవక ముందే ప్రతిపక్షం టీడీపీ విమర్శలు మొదలు పెట్టింది. జగన్ మాట తప్పారంటూ ఆరోపిస్తోంది.సీఎం జగన్ రైతు భరోసా విషయంలో మాట తప్పారంటున్నారు ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న. పాదయాత్ర చేస్తున్న సమయంలో భరోసా కింద రూ.12,500 ఇస్తామని చెప్పారని.. ఇప్పుడు మాత్రం రూ.7,500 మాత్రమే ఇస్తున్నారని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వాలంటీర్లకు ప్రతి నెలా రూ. 8వేల వేతనం ఇస్తున్నారని.. రైతుకు మాత్రం రూ.625 ఇస్తారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో జీఎస్టీతో పాటు జేఎస్టీ కూడా విధిస్తున్నారని సెటైర్లు పేల్చారు.. 5 నెలల్లోనే జగన్‌పై ప్రజలు నమ్మకం కోల్పోయారన్నారు.జగన్ 2017లో జరిగిన పార్టీ ప్లీనరీలో ఏం చెప్పారో ఓసారి గుర్తు చేసుకోవాలన్నారు టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర. ప్రధాని కిసాన్ యోజన పేరుతో కేంద్రం ఇచ్చే నిధుల్ని కలిపి రైతు భరోసా కింద ఇస్తున్నారని.. జగన్ హామీ ఇచ్చినప్పటికి ప్రధాని కిసాన్ యోజన ప్రకటించలేదన్నారు. కేంద్రం రైతులకు ఇచ్చిన రూ. 6వేల మొత్తాన్ని రాష్ట్రం తన ఖాతాలో వేసుకుందన్నారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులందరికీ రూ.50 వేలు ఇస్తామని చెప్పి.. మాట తప్పి ఇప్పుడు విడతల వారీగా ఇస్తున్నారని విమర్శించారు. ఓసీ కౌలు రైతులకు భరోసా ఇవ్వలేదని.. కులాల పేరుతో రైతులను విడదీసిన ఘనత జగన్ సర్కార్‌కే దక్కుతుందన్నారు.
No comments:
Post a Comment