Breaking News

15/10/2019

పోలీసు త్యాగాలను మరవలేం

నిర్మల్, అక్టోబర్,15 (way2newstv.in)
అనునిత్యం విధులలో ఉంటూ, నిస్వార్థంగా సేవలు చేస్తూ, విధి నిర్వహణలో పోలీసులు చేసిన ప్రాణ త్యాగాలే నేటి శాంతియుతమైన వాతావరణానికి మూల కారణమని నిర్మల్ జిల్లా ఎస్పీ .సి.శశిధర్ రాజు  పేర్కొన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను (అక్టోబర్ 15-అక్టోబర్ 21) పురస్కరించుకొని మంగళవారం నర్సాపూర్ (జి) పోలీస్ స్టేషన్ లో ఓపెన్ హౌస్ కార్యక్రమం ద్వారా ఈ వారోత్సవాలను ఎస్పీ  ప్రారంభించారు. ఈ సందర్భంగా విధి నిర్వహణలో భాగంగా పోలీసులు వినియోగించే ఆయుధాల పనితీరుపై విద్యార్థులకు ఎస్పీ  వివరించారు. అనంతరం ఎస్పీ  మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణతో పాటు నేరాలను నియంత్రించేందుకు పోలీసు విభాగం ఎంతో పటిష్టంగా ఏర్పాటు అయింది అన్నారు. 
పోలీసు త్యాగాలను మరవలేం

నిర్మల్ జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణలో 20 మంది పోలీసులు ప్రాణత్యాగాలు చేశారని చెప్పారు. వారి త్యాగాల ఫలితమే నేడు పోలీసుల ప్రజల వద్ద వెళ్ళి వారికి సేవలందించడం జరుగుతోందని. పోలీసుల అమరవీరుల త్యాగాల ఫలమే నేటి నిర్మల్ జిల్లాలో శాంతి స్థాపన జరిగిందని, ప్రతినిత్యం ప్రజాసేవలో విధులు నిర్వర్తిస్తూ ప్రాణత్యాగాలు చేసిన పోలీసు అమరవీరులను స్మరించుకోవాల్సిన అవసరం ప్రజలకు వుందని. పోలీసులు నిర్వర్తించే విధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ఈ ఓపెన్ హౌజ్లను ఏర్పాటు చేసామని ఎస్పీ  తెలియజేసారు. ఈ కార్యక్రమంలో ఎస్బి ఇన్స్పెక్టర్ బి.వెంకటేష్, ఎస్.ఐ. వెంకట రమణ, నర్సాపూర్ సర్పంచ్, రాంరెడ్డి,  కిషన్ రావ్, హెడ్ మాస్టర్, , అరవింద స్కూల్ విద్యార్థులు, యువకులు, గ్రామస్తులు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

No comments:

Post a Comment