Breaking News

19/10/2019

22 తర్వాత కొలిక్కి రానున్న కర్ణాటక

బెంగళూర్, అక్టోబరు 19 (way2newstv.in)
కర్ణాటక భారతీయ జనతా పార్టీలో గత రెండు నెలల నుంచి ఉన్న టెన్షన్ ఎటువైపు దారితీస్తుందోనన్న ఆందోళన మొదలయింది. ప్రధానంగా ముఖ్యమంత్రి యడ్యూరప్ప ఆరోజు కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్, జేడీఎస్ లనుంచి రాజీనామాలు చేసిన 17 మంది ఎమ్మెల్యేలపై అప్పటి స్పీకర్ రమేష్ కుమార్ అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే. స్పీకర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ 17 మంది ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాము ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే అనర్హత వేటు వేయడమేంటన్నది వారి వాదన.రాజీనామాల కారణంగానే సంకీర్ణ సర్కార్ కూలిపోయింది. భారతీయ జనతా పార్టీని గద్దెనెక్కించడానికే పదిహేడు మంది ఎమ్మెల్యేలు పార్టీ నిబంధలనకు విరుద్ధంగా రాజీనామాలు చేశారని కాంగ్రెస్, జేడీఎస్ లు వాదిస్తున్నాయి. 
 22 తర్వాత కొలిక్కి రానున్న కర్ణాటక

బీజేపీకి లాభం చేకూర్చేందుకే రాజీనామాలు చేశారన్నది ఆ పార్టీల వాదన. ఈ రెండు వాదనలపై సుప్రీంకోర్టు విచారించనుంది. కాగా ఈ నెల 22వ తేదీన సుప్రీంకోర్టులో అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలపై విచారణ జరగనుంది. అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేల విషయంలో ఒక స్పష్టత రానుంది.ఇప్పటికే కర్ణాటకలో అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో పదిహేను స్థానాలకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. డిసెంబరు 5వ తేదీన ఈ పదిహేను స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ పిటీషన్ పై ఇప్పటికే సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఇరుపక్షాల వాదనలను వినింది. అయితే తీర్పు ఎలా వస్తుందోనన్న టెన్షన్ అన్ని పార్టీలనేతల్లో ప్రారంభమయిందనే చెప్పాలి. ఇప్పటికే ఉప ఎన్నికల కోసం అన్ని పార్టీలూ కర్ణాటకలో రెడీ అయిపోయాయి. కాంగ్రెస్, జేడీఎస్ లు అయితే తమ అభ్యర్థులను కూడా దాదాపుగా ఖరారు చేశాయి.ఒక్క బీజేపీ మాత్రం ఇంకా అభ్యర్థులను నిర్ణయించలేదు. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి అభ్యర్థులను బీజేపీ నిర్ణయిస్తుంది. సుప్రీంకోర్టు అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలకు తీర్పు అనుకూలంగా ఇస్తే వారినే ఈ ఉప ఎన్నికల్లో అభ్యర్థులవుతారు. ఈ విషయాన్ని ఇప్పటికే యడ్యూరప్ప స్పష్టం చేశారు. అయితే స్పీకర్ నిర్ణయాన్ని సమర్థిస్తూ తీర్పు చెబితేనే బీజేపీకి కష్టమవుతోంది. అప్పుడు అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలు పోటీ చేసేందుకు వీలుండదు. వారి వారసులను ఎంపిక చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే బీజేపీలో ఆ నియోజకవర్గాల్లో అసంతృప్తి పెరిగిపోయింది. అందువల్లనే సుప్రీంకోర్టు తీర్పు కోసం అన్ని పార్టీలూ వేచి చూస్తున్నాయి.

No comments:

Post a Comment