Breaking News

19/10/2019

పార్టీ కోసం ధింక్ ట్యాంక్ టీమ్

విజయవాడ, అక్టోబరు 19(way2newstv.in)
చేతులు కాలకా ఆకులు పట్టుకుంటున్నారు టీడీపీ బాస్. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు నలభై ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న నేత. ఆయనకు ఒకరు సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆయన స్వయం నిర్ణయాలు తీసుకునే అనుభవం, అవగాహన ఉన్న వ్యక్తి. ముఖ్యమంత్రిగా, విపక్షనేతగా అనుభవం ఉన్న చంద్రబాబుకు ఇప్పుడు థింక్ ట్యాంక్ గురించి ఆలోచిస్తున్నారట. పార్టీలో సమయానుకూలంగా, సరైన నిర్ణయాలు తీసుకునే టీం కోసం చంద్రబాబు వెతుకుతున్నట్లు పార్టీ వర్గాల నుంచి తెలుస్తోంది. చంద్రబాబు నాయుడు సహజంగా ఒకరి సలహాలు స్వీకరించరంటారు. తాను అనుకున్నది కరెక్టేనని గట్టిగానమ్ముతుంటారు.2014 ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీని కలుపుకొని వెళ్లడం కలసి వచ్చింది. అలాగే జనసేన అధినేత పవన్ కల్యాణ్ మద్దతు పొందడం కూడా చంద్రబాబుకు ప్లస్ అయింది. 
పార్టీ కోసం ధింక్ ట్యాంక్ టీమ్

అందుకే ఆయన సునాయాసంగా అప్పట్లో అధికారంలోకి రాగలిగారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన తీసుకున్న అనేక నిర్ణయాలు వికటించాయి. రైతు రుణమాఫీ దగ్గర నుంచి తాత్కాలిక భవనాల నిర్మాణం వంటివి ఎన్నికల్లో కలసి రాలేదు. అలాగే ఎన్నికలకు ముందు పసుపు కుంకుమ, పింఛన్లు పెంపుదల వంటి నిర్ణయాలు కూడా చంద్రబాబుకు ఏమాత్రం అచ్చిరాకుండా పోయాయి.అంతేకాకుండా భారతీయ జనతాపార్టీతో విభేధించడం, ఎన్డీఏ నుంచి బయటకు రావడం కూడా చంద్రబాబు ఒక్కరి నిర్ణయమే. సీనియర్ నేతలతో చర్చించినా వారిలో కొందరు అభ్యంతరం చెప్పారు. సుజనా చౌదరి వంటినేతలు వద్దంటున్నా బీజేపీతో తెగదెంపులు చేసుకున్నారు. అదే చంద్రబాబుకు మైనస్ గా మారింది. కేంద్రం సహకారం లేకపోవడంతో ఎన్నికల సమయంలో ఆర్థిక ఇబ్బందులను చంద్రబాబు ఎదుర్కొనాల్సి వచ్చింది. ఇప్పడు బీజేపీతో విభేదించడంపై చంద్రబాబు రియలైజ్ అవుతున్నారు.అయితే చంద్రబాబు పార్టీ కార్యక్రమాలతో బిజీగా ఉండటం కారణంగా వ్యూహాలను అమలు చేయడం కోసం థింక్ ట్యాంక్ ను టీడీపీలో పెట్టాల్సిన అవసరం ఉందని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో ప్రజాభిప్రాయానికి అనుగుణంగా పార్టీ నడుచుకుంటేనే సక్సెస్ ఉంటుందని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకోసమే థింక్ ట్యాంక్ ఆలోచన వచ్చిందంటున్నారు. సీనియర్ నేతలు యనమల రామకృష్ణుడు, కేఈ కృష్ణమూర్తి లాంటి నేతలు ఉన్నా వారికి ప్రజలతో నేరుగా సంబంధాలుండవు. అందుకే అనుభవం ఉన్న యువనేతలతో థింక్ ట్యాంక్ నుపార్టీకి ఏర్పాటు చేయాలన్నది చంద్రబాబు ఆలోచన. వీరు ఎప్పటికప్పుడు ప్రజాభిప్రాయాలకు అనుగుణంగా క్యాలండర్ రూపొందించాల్సి ఉంటుంది. మరి ఈ థింక్ ట్యాంక్ లో ఎవరెవరుంటారనేది త్వరలోనే తెలియనుంది.

No comments:

Post a Comment