హైద్రాబాద్, అక్టోబర్ 19 (way2newstv.in)
టాలీవుడ్‌లో అడల్ట్ కంటెంట్ చిత్రాలకు కొదువలేకుండా పోయింది. మితిమీరిన శృంగాల సన్నివేషాలతో పాటు పచ్చిబూతులతో ఏ సర్టిఫికేట్ చిత్రాలు కుప్పలు తెప్పలుగా వస్తున్నాయి. అయితే ఇలాంటి అడల్ట్ కంటెంట్ చిత్రంలో వేశ్యగా కనిపించి షాక్ ఇచ్చింది ఒకప్పటి స్టార్ హీరోయిన్ సదా. ‘జయం’ మూవీలో వెళ్లవయ్యా.. వెళ్లు.. వెళ్లూ అంటూ లంగా ఓణి కట్టుకుని కుర్రకారు మదిలో సదా చేసిన గజ్జెల సౌండ్ చానాళ్లు టాలీవుడ్‌లో రీసౌండ్ వచ్చింది. తేజ దర్శకత్వంలో వచ్చిన ఆ మూవీలో సదా తన అందచందాలతో ప్రేక్షకులకు గాలం వేసి.. వరుస ఆఫర్స్‌ను అందిపుచ్చుకుంది.
వేశ్య పాత్రలో సదా..
అనంతరం అపరిచితుడు లాంటి బ్లాక్ బస్టర్‌ను తన ఖాతాలో వేసుకుంది.అయితే ఈ మధ్యకాలంలో ఆమెకు ఆఫర్స్ లేకపోవడంతో ఇదిగో ఇలా ‘శ్రీమతి 21 ఎఫ్’ చిత్రంలో వేశ్యగా మారింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేశారు. 1990లో తమిళనాడు - ఆంధ్ర హైవేలో జరిగిన వాస్తవ సంఘటన ఆధారంగా ఒక వేశ్య జీవితంలో జరిగిన యాదార్ధ సంఘటనల్ని ఈచిత్రంలో చూపిస్తున్నారు.తాజా ట్రైలర్‌లో సదా హైవే పక్కన టార్చ్ లైట్ వేసి లారీలను ఆపే వేశ్యపాత్రలో నటించి షాక్ ఇచ్చింది. ‘జాకెట్ నేను విప్పనా.. నువ్వే విప్పుతావా?’.. అంటూ శృంగాల సన్నివేశాల్లో రెచ్చిపోయి నటిస్తోంది. ఒక వేశ్య బాధను ఈ పాత్ర ద్వారా దర్శకుడు చూపించే ప్రయత్నం చేసినప్పటికీ అశ్లీలత ఎక్కువగా ఉంది. సదా అంగాగ ప్రదర్శనతో తనలోని గ్లామర్ యాంగిల్‌కు పదునుపెట్టింది. ఒక బలమైన నేపథ్యం ఉన్న కథతో సదా గట్టి సందేశాన్ని ఇచ్చే సాహసాన్ని ఈ వేశ్య పాత్ర ద్వారా చేసింది. ఈ చిత్రానికి అబ్దుల్ మజీత్ దర్శకత్వం వహించగా.. ఏఆర్ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌లో నవంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది
No comments:
Post a Comment