Breaking News

19/09/2019

మరాఠలోని ఐదు గ్రామాలు తెలంగాణలోనే కలపండి

హైద్రాబాద్, సెప్టెంబర్ 19, (way2newstv.in)
మరాఠ లోని కి చెందిన వివిధ పార్టీలకు చెందిన నేతలు సీఎం కేసీఆర్ ని కలిశారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చెయ్యాలని కేసీఆర్ ని అడిగారు. అందుకు సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. అదే సమయంలో వారు మరో డిమాండ్ ను ఉంచారు. తమ గ్రామాలను తెలంగాణలో కలుపుకోవాలని కోరారు. నల్గావ్, బోకర్, డెగ్లూర్, కిన్ వత్, హత్ గావ్.. తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉండే గ్రామాలు. తెలంగాణకి చెందిన ప్రజలు ఆ ప్రాంతాల్లో ఎక్కువగా నివాసం ఉంటున్నారు. దీంతో తమ గ్రామాలను కలిపేయాలని కోరడంతో పాటు.. మరో కోరికను కేసీఆర్ ముందు వచ్చారు. 
 మరాఠలోని ఐదు గ్రామాలు తెలంగాణలోనే కలపండి

తెలంగాణలో రైతుల కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బంధు, రైతు బీమా పథకాలను వారు ప్రశంసించారు. ఈ పథకాలు చాలా బాగున్నాయని కితాబిచ్చారు. ఆ పథకాలను తమ గ్రామాల్లోనూ అమలు చేయాలని కోరారు. నాందేడ్ కి చెందిన నాయకులే కాదు.. బీవాండీ, షోలాపూర్, రాజరా ప్రాంతాలకు చెందిన నేతలు.. టీఆర్ఎస్ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. తమకు టీఆర్ఎస్ టికెట్లు ఇవ్వాలని అడుగుతున్నారు. ''నేను నల్గావ్ లో టీఆర్ఎస్ తరఫున పోటీ చేసేందుకు రెడీగా ఉన్నా. రైతుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం పథకాలు అమలు చేస్తోంది. అదే తరహాలో మహారాష్ట్రంలోనూ రైతుల కోసం పథకాలు అమలు చెయ్యాలి'' బాబ్లీ గ్రామ సర్పంచ్ బాబూరావు కదం చెప్పారు. తమ గ్రామాలను తెలంగాణలో విలీనం చెయ్యాలని చేస్తున్న ఉద్యమానికి బాబూ రావ్ కదం ముందుండి నడిపిస్తున్నారు.''తెలంగాణలో విలీనం చెయ్యాలని రెండేళ్ల క్రితం ధర్మాబాద్ తాలూకాకి చెందిన 40 గ్రామాలు తీర్మానం చేశాయి. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం రూ.40 కోట్ల నిధులు మంజూరు చేసింది. కానీ ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా ఖర్చు చెయ్యలేదు'' అని నాందేడ్ కి చెందిన నేతలు వాపోయారు. ఇతర రాష్ట్రాల్లో తెలంగాణ వాసులు ఎక్కువగా నివసిస్తున్న చోట ఎన్నికల్లో పోటీ చేసేందుకు టీఆర్ఎస్ నేతలు ఫోకస్ పెట్టారు. కర్నాటక, మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో ఎన్నికల్లో పోటీ చేయాలని ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

No comments:

Post a Comment