Breaking News

05/09/2019

ఏడున గవర్నర్ కు వీడ్కోలు

హైద్రాబాద్, సెప్టెంబర్ 5 (way2newstv.in)
రేపు గవర్నర్‌ నరసింహన్‌కు రాష్ట్ర ప్రభుత్వం వీడ్కోలు సభ నిర్వహించనుంది. ఈ వేడుకకు సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ప్రభుత్వ ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. 8వ తేదీన కొత్త గవర్నర్‌గా తమిళిసై సౌందర్‌ రాజన్‌ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ క్రమంలో 7వ తేదీనే గవర్నర్‌ నరసింహన్‌కు ప్రభుత్వం వీడ్కోలు సభ నిర్వహించనుంది. ఈ కార్యక్రమానికి సంబంధించి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.-నరసింహన్ 1945లో తమిళనాడులో జన్మించారు. హైదరాబాద్‌లోని లిటిల్‌ఫ్లవర్ హైస్కూల్లో ప్రాథమిక విద్యాభ్యాసం. 
ఏడున గవర్నర్ కు వీడ్కోలు

తదుపరి చదువు మద్రాసులో కొనసాగింది. మద్రాస్ ప్రెసిడెన్సీ కళాశాల నుంచి పొలిటికల్ సైన్స్‌లో గోల్డ్‌మెడల్. మద్రాసు లా కళాశాలలో న్యాయవిద్యను అభ్యసించారు.
-1968లో సివిల్ సర్వీసెస్‌లో ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. ఆయనను ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు కేటాయించారు. కొంతకాలంనంద్యాలలో, ఆపై ఒంగోలులోని నరసరావు పేటలో పనిచేశారు. 1972లో ఇంటెలిజెన్స్ బ్యూరోకు వెళ్లారు. అప్పటినుంచి 2006 డి సెంబర్‌లో రిటైర్ అయ్యేవరకు అక్కడే పనిచే శారు. సర్వీసు చివరలో ఏడాదికాలంపాటు ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్‌గా పనిచేశారు.
-రెండుదఫాలుగా విదేశీ వ్యవహారాల శాఖలో పనిచేశారు. 1981-84 మధ్య మాస్కోలోని భారత రాయబార కార్యాలయంలో ఫస్ట్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వర్తించారు. 1996 నుంచి 1999 వరకు విదేశాల్లోని రాయబార కార్యాలయాల భద్రతా వ్యవహారాలు చూశారు.-నేషనల్ డిఫెన్స్ కాలేజీ పూర్వ విద్యార్థి అయిన నరసింహన్‌కు సంగీతం అంటే ఇష్టం. కర్ణాటక, హిందుస్థానీ సంగీతాన్ని బాగా ఆస్వాదిస్తారు.
-2006 డిసెంబర్‌లో నరసింహన్ రిటైర్ అయిన వెంటనే.. ఆయనను ఛత్తీస్‌గఢ్ గవర్నర్‌గా నియమితులయ్యారు. ఆ సమయం లో మావోయిస్టుల ప్రాబల్యాన్ని తగ్గించడానికి నరసింహన్ విశేష కృషిచేశారు.
-2010 జనవరిలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా నరసింహన్ బాధ్యతలు స్వీకరించారు. 2012 మేలో మరో ఐదేండ్లు ఆయన పదవీకాలాన్ని కేంద్రం పొడిగించింది.
-తెలంగాణ ఏర్పడిన తర్వాత 2 జూన్ 2014 నుంచి ఆయన రెండు తెలుగు రాష్ర్టాలకు గవర్నర్‌గా కొనసాగారు. కొద్ది రోజుల క్రితమే కేంద్రం ఏపీకి నూతన గవర్నర్‌ను నియమించగా.. అప్పటినుంచి నరసింహన్ తెలంగాణ గవర్నర్‌గా కొనసాగుతున్నారు.నరసింహన్ సతీమణి విమలా నరసింహన్. వారికి ఇద్దరు కొడుకులు, ముగ్గురు మనుమలు, మనుమరాండ్లు ఉన్నారు.

No comments:

Post a Comment