Breaking News

11/09/2019

విజయనగరం రాజులకు కష్టకాలమేనా

అశోకుడికి కళ మసక బారుతోందా...
విజయనగరం, సెప్టెంబర్ 11, (way2newstv.in)
విజయనగరం మహారాజు, కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు గట్టి దెబ్బే తగిలింది. వారి పూర్వీకుల నుంచి వస్తున్న మాన్సాస్‌ (మహారాజా అలక్‌నారాయణ్‌ సొసైటీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌సైన్స్‌) ట్రస్ట్‌లో ఇన్నాళ్ళూ సాగిన కరస్పాండెంట్ల కధని కంచికి చేర్చేశారు. ఆ విధంగా అనధికార వ్యకులతో రాజ్యం చేస్తున్న మాన్సాస్ ని ఇకపై పూర్తిగా ప్రభుత్వం కంట్రోల్ లోకి తీసుకుంది. ఈ విషయంలో కోర్టు తీర్పునకు అనుగుణంగా వైసీపీ సర్కార్ వ్యవహరించడమే కాదు, అధికారంలోకి వచ్చిన మూడు నెలల కాలంలోనే మాన్సాస్ ట్రస్ట్ కి ప్రభుత్వం తరఫున ఈవోను నియమించడం ద్వారా కట్టడి చేసినట్లైంది. మహారాజా అలక్ నారాయణ గజపతి అన్న వారు అశోక్ కొ పూర్వం ఉన్న రాజులు. 
 విజయనగరం రాజులకు కష్టకాలమేనా

వారి పేరు మీద ప్రారంభించిన మాన్సాస్ ట్ర‌స్ట్ లో ఇప్పటిదాకా అశోక్ గజపతిరాజు  కోరుకున్న వారే కరస్పాడెంట్లగా ఉంటూ వచ్చారు. వీరంతా అనధికారికగా బాధ్యతలు నిర్వహిస్తున్న వారే కావడం విశేషందేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నడిచే సేవా ట్రస్ట్ గా మాన్సాస్ ఉంది. ప్రధానంగా మాన్సాస్ తరఫున కళాశాలలు కూడా నడుపుతున్నారు. ఓ విధంగా ఇక్కడ మంచిగానే అంతా జరుగుతున్నా జవాబుదారితనం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో దేవాదాయ శాఖఆధీనంలో ఉన్న మాన్సాస్ కి ప్రభుత్వ అధికారుల అజమాయిషీ ఉండాలని 2006లో దేవాదాయ శాఖ కోర్టుకు వెళ్ళింది. కోర్టు సైతం దేవాదాయ శాఖకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దంతోదేవాదాయ శాఖ తరఫున ఈవోలను నియమించాల్సి ఉండగా అప్పట్లో అధికారంలో ఉన్న అశోక్ తన రాజకీయ పలుకుబడి ఉపయోగించి తన వారే కరస్పాండెంట్లుగా కొనసాగేలా చూసుకున్నారు. ఇకఇపుడు వైసీపీ సర్కార్ అధికారంలోకి రావడంతో తొలి దెబ్బ మాన్సాస్ మీద పడింది. కచ్చితమైన అధికారిగా పేరుపొందిన దేవాదాయశాఖ మల్టీజోన్‌-1 రీజనల్‌ జాయింట్‌ కమిషనర్‌ భ్రమరాంబఇఒగా అదనపు బాధ్యతలు తీసుకున్నారు.దీంతో ఓ విధంగా అశోక్ గజపతిరాజు హవాకుబ్రేకులు పడినట్లేనని అంటున్నారు. రాజకుటుంబీకులు చైర్మన్లుగా ఉంటే కరస్పాండెంట్లుగా ఇంతవరకూ వారిమనుషులే ఉండేవారు. ఇపుడు మాత్రం ప్రభుత్వం నియంత్రణ ఉండడం వల్ల మాన్సాస్ పై పూర్తి ఆధిపత్యం రాజులకు పోయిందన్న మాట వినిపిస్తోంది. విజయనగరం జిల్లా రాజకీయాల్లో అశోక్గజపతిరాజు కి బొత్స సత్యనారాయణ ఎదురునిలిచి ఉంటారు. ఆయన ఇపుడు మంత్రిగా కీలకంగా ఉన్నారు. దాంతో మాన్సాస్ కధ కూడా రాజకీయంగానే మలుపు తిరిగిందన్న ప్రచారం సాగుతోంది.ఏది ఏమైనా అశోక్ గజపతిరాజు ప్రభ టీడీపీలోనూ తగ్గుతోంది. ఇపుడు ఆయన పూర్వీకులు స్థాపించిన మాన్సాస్ ట్రస్ట్ లోనూ పట్టు తగ్గడం అంటే అశోక్ గజపతిరాజు కళ మసకబారిందన్న మాటవినిపిస్తోంది.

No comments:

Post a Comment