వైసీపీ ఎంపీల వాయిస్ సైలెంట్ అయిపోయిందా...
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 11, (way2newstv.in)
ప్రస్తుతం రాష్ట్రానికి కేంద్రం నుంచి అనేక రూపాల్లో సాయం అందాల్సి ఉంది. ప్రత్యేక హోదా తో సహా పోలవరానికి నిధులు సహా అనేక రూపాల్లో కేంద్రం నుంచి నిధులు రావాల్సి ఉంది. ముఖ్యంగా వైసీపీఅధినేత, ప్రస్తుత సీఎం జగన్ ఎన్నికల సమయంలో తమకు మిక్కిలి సంఖ్యలో ఎంపీలను కట్టబెట్టండి కేంద్రం ఎందుకు హోదా ఇవ్వదో చూస్తామని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే ఆయనకు ఏకంగా22 మంది ఎంపీలు దక్కారు. వైసీపీ ఓడిపోయిన మూడు ఎంపీ సీట్లు కూడా చాలా స్వల్ప తేడాతో మాత్రమే కోల్పోయింది.ఇది నిజానికి అప్రతిహత విజయం. బహుశా భవిష్యత్తులో ఇలాంటి విజయం ఏ పార్టీకి దక్కే అవకాశం ఉంటుందని అనుకోలేం. మరి ఆ రేంజ్‌లో ఎంపీలను కైవసం చేసుకున్నా.. వైసీపీలో మాత్రంనిర్వేదం కనిపిస్తోంది.22 మంది ఎంపీలు లోక్‌సభకు ప్రాధాన్యం వహిస్తున్నా.. పట్టుమని పది మంది కూడా అనుభవజ్ఞులు లేక పోవడం పెద్ద వెలితిగా ఉంది. తొలిసారి ఎంపీలుగా గెలిచిన వారేఎక్కువగా ఉండడం, వీరిలోనూ పెద్దగా రాజకీయ కుటుంబాలు లేదా అనుభవం ఉన్న వారు లేక పోవడంతో కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం పార్లమెంటులో అనుసరించే వ్యూహానికి ప్రతివ్యూహంవేసే నాయకులు పెద్దగా మనకు వైసీపీలో కనిపించడం లేదు. రాజధాని గుంటూరు జిల్లా నరసారావుపేట విషయాన్ని తీసుకున్న ఇక్కడ నుంచి యువకుడు, ఉన్నత విద్యావంతుడు లావుకృష్ణదేవరాయులు విజయం సాధించారు. అయితే, రాజకీయాలు ఆయనకు ఇదే తొలిసారి.
ఏపీ ఎంపీలు ఏం చేస్తున్నారు...
ఇక, అరకు నుంచి విజయం సాధించిన గొడ్డేటి మాధవి కూడా రాజకీయాలకు కొత్తే. అంతేకాదు, మాట్లాడితే..ఏం జరుగుతుందోననే భయమో.. ఏమో. ఆమె మీడియా ముందుకు కూడా రారు. రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ కూడా కొత్తే. నరసాపురం నుంచి విజయం సాధించిన కనుమూరురఘురామకృష్ణరాజు కూడా కొత్తగానే ఎన్నికయ్యారు…ఇలా .. ఈ జాబితాలో చాలా మందే ఉన్నారు. వీరంతా కూడా కేంద్రంలో బలమైన నాయకులతో వాగ్యుద్ధం చేసి రాష్ట్ర ప్రయోజనాల విషయంలోనిలదీసే కనిపించడం లేదు.ఇక కాకినాడ ఎంపీ వంగా గీత గతంలో రాజ్యసభ ఎంపీగా చేసినా ఇప్పుడు ఆమె వాయిస్ ఏ మాత్రం వినపడడం లేదు. ఇక అమలాపురం ఎంపీ చింతా అనూరాధ,అనకాపల్లి ఎంపీ సత్యవతి సైతం తొలిసారి ఎంపీలుగా గెలిచారు. వీరిలో కూడా పార్టీకి ఎలాంటి ఉపయోగం లేదు. ఇక ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డిఉన్నా వాళ్లకు వాళ్ల వ్యాపారాలు మినహా ఏం పట్టవన్న విమర్శలు ఉండనే ఉన్నాయి. మరి జగన్ ఇలాంటి వారితో ఎలాంటి ప్రయోజనాలు సాధిస్తారో చూడాలి.టీడీపీ ఎంపీల సంగతేంటీ...రాష్ట్రంలో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో టీడీపీ తరఫున గెలిచిన ముగ్గురే ముగ్గురు. మొత్తం 25 స్థానాలకు గాను 22 చోట్ల వైసీపీ జయకేతనం ఎగుర వేయగా.. గుంటూరు, విజయవాడ, శ్రీకాకుళంనియోజకవర్గాల్లో మాత్రమే టీడీపీ విజయం సాధించింది. అయితే, ఈ ముగ్గురు త్రిమూర్తులు ఇప్పుడు ఏం చేస్తున్నారు? అనే ప్రశ్న తెరమీదికి వస్తోంది. వారు ఎంపీగా ఎన్నికై 100 రోజులుపూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో వారు చేస్తున్న అభివృద్ది కార్యక్రమాలు ఏంటి ? ప్రజలకు చేరువగా ఉంటున్నారా ? ప్రజా సమస్యలపై స్పందిస్తున్నారా ? లేదా ? అనే అంశాలు తెరమీదికి వస్తున్నాయి.గుంటూరు ఎంపీగా రెండో సారి విజయం సాధించారు గల్లా జయదేవ్.గత టెర్మ్‌లో ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో మిస్టర్ పీఎం అంటూ ఆయన పార్లమెంటులో సంచలన ప్రసంగం చేశారు. దీంతోరాష్ట్రంలోనే కాకుండా దేశంలోనూ ఆయన గుర్తింపు పొందారు. ఈ ఊపుతోనే ఆయన రెండో సారి గెలుపు గుర్రం ఎక్కారు. ఇక, ఇప్పుడు వంద రోజులు పూర్తి చేసుకున్నా ఆశించిన మేరకు ఆయనపురోగతి సాధించలేదనేది వాస్తవం. ఆయన ముందు అనేక సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా కృష్ణానది చెంతనే ఉన్నా, ఈ నియోజకవర్గంలో ప్రజలకు గుక్కెడు తాగునీరు కావాలన్నా ఇబ్బందులుఉన్నాయి.ఇక, అమరావతి, గుంటూరు ప్రత్యేక రైలు ఏర్పాటు ప్రతిపాదనలు ముందుకు సాగడం లేదు. నడికుడి-తిరుపతి లైను ప్రతిపాదన ఓకే అయినా పనులు నత్తనడకన సాగుతున్నాయి.ఆయావిషయాల్లో ఆయన దూసూకుపోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. గెలిచినప్పుడు ఐదేళ్ల పాటే నియోజకవర్గాన్ని పెద్దగా పట్టించుకోని జయదేవ్ ఇప్పుడుప్రతిపక్షంలో ఉన్నా వ్యాపారాలుగుంటూరు వైపు కన్నెత్తి చూడడం లేదన్నదే అక్కడ జనాల టాక్. వరుసగా రెండుసార్లు గెలిపించిన ప్రజలను పక్కన పెట్టి సొంత వ్యాపారాలు, వ్యవహారాలతోనేతలమునకలవుతుండడంతో విమర్శలు ముసురుకున్నాయి. ఇక, పార్టీలోనూ పెద్దగా గళం వినిపించకపోవడం గమనార్హం. ఇక, శ్రీకాకుళం నుంచి వరుసగా రెండో సారి కూడా విజయం సాధించినకింజరాపు రామ్మోహన్ నాయుడు మీడియాలో తరచుగా కనిపిస్తున్నారు. పార్టీ తరఫున, ప్రజల సమస్యలపైనా దృష్టి పెడుతున్నారు. యువతను సంఘటితం చేయడంలోనూ కీలక పాత్రపోషిస్తున్నారు. కేంద్రం నుంచి జిల్లాకు, రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో గళం విప్పుతున్నారు.టీడీపీ అధికారంలో లేకపోయినా.. పార్టీకి అవసరమైన అన్ని విధాలా సాయం అందిస్తున్నారు.భవిష్యత్తులో పార్టీ పుంజుకోవాలంటే రామ్మోహన్‌నాయుడుకు ఏపీ టీడీపీ పగ్గాలు ఇవ్వాలన్న చర్చలు కూడా ఎక్కువుగా నడుస్తున్నాయి. ఇక, విజయవాడ ఎంపీ కేశినేని వివాదాలకు కేంద్రంగామారిన విషయం తెలిసిందే. తనకు పార్టీ తరఫున పదవులు దక్కలేదనే అసంతృప్తితో ఆయన కొట్టుమిట్టాడుతున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ నాయకులపైనే ఆయన విమర్శలు సంధిస్తున్నారు. అటుచంద్రబాబుతో పాటు సొంత పార్టీ నేతలపై ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అభివృద్ధి విషయంలో పెద్దగా పట్టించుకోకపోయినా.. కీలకమైన గ్రామాలను దత్తత తీసుకునే పని మాత్రం చేస్తున్నారు.అయితే, పార్టీ మారతారనే ఊహాగానాలు వినిపిస్తున్నా.. దీనిపై ఎలాంటి క్లారిటీ లేదు. మొత్తంగా ముగ్గురు టీడీపీ ఎంపీల్లో ఒక్క రామ్మోహన్ నాయుడికి మాత్రమే మంచి మార్కులు పడుతున్నాయి
No comments:
Post a Comment