Breaking News

30/09/2019

సాగర్ లో పోటెత్తిన వరద నీరు

నాగార్జునసాగర్ సెప్టెంబర్ 30, (way2newstv.in)
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు నాగర్జునసాగర్లోకి వరద నీరు పోటెత్తుతోంది. అధికారులు 4 క్రస్ట్ గేట్లను 10 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ఇన్ఫ్లో 1.24 లక్షల క్యూసెక్కులు కాగా, ఔట్ఫ్లో 1.11 లక్షల క్యూసెక్కులు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 589.90 అడుగులుగా ఉంది.నాగార్జునసాగర్ పూర్తి నీటి సామర్థ్యం 312 టీఎంసీలు కాగా, ప్రస్తుతం నిల్వ ఉన్న నీరు 311.74 టీఎంసీలుగా ఉన్నట్లు అధికారులు నివేదిక వెల్లడించారు.
సాగర్ లో పోటెత్తిన వరద నీరు

No comments:

Post a Comment