Breaking News

25/09/2019

బ్రిడ్జి నిర్మించి శాశ్వత పరిష్కారం చేయండి

బది నేహాల్ సెప్టెంబర్ 25   (way2newstv.in)
కర్నూలు జిల్లా లోని బది నేహాల్ -కుంటన హాల్ మధ్య 100 మీటర్ల కొత్త బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని సిపిఎం పార్టీ కౌతాళం మండల సీనియర్ నాయకులు  మల్లయ్య, మండల కార్యదర్శి కే లింగన్న,మండల నాయకులు బి ఉలిగయ్య  ప్రభుత్వాన్ని  డిమాండ్ చేశారు. గత పది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తాత్కాలిక బ్రిడ్జ్ కుప్పకూలిపోయి ప్రజలకు, విద్యార్థులకు, పొలాలకు వెళ్లే రైతులకుతీవ్ర అంతరాయం కలిగింది అని వారు అన్నారు. 
బ్రిడ్జి నిర్మించి శాశ్వత పరిష్కారం చేయండి

బదినేహాల్ లో పదవ తరగతి  వరకు చదువుతున్న విద్యార్థులు  కుంటనహాల్  గ్రామానికి బస్సుల్లేక   రోజు నడుచుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితిఏర్పడిందని వారు అన్నారు. అలాగే బాపురం డమ్మలదిన్నె గ్రామాల మధ్య ఉన్న కల్వర్టు బ్రిడ్జి వర్షాలకు పొంగడంతో బస్సులు ,ఆటోలు, స్కూటర్లు  రాకపోకలు జరగడం లేదన్నారు. దీనివల్ల ప్రజలకుబాపురం  నుండి లింగాలదిన్నె వరకు వెళ్లడం చాలా ఇబ్బందికరంగా మారిందని అన్నారు. కావున ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కొత్త మండలం లో ఈ రెండు చోట్ల 100 మీటర్ల తో బ్రిడ్జి నిర్మాణంచేపట్టాలని,ప్రజలకు అందుబాటులో ఉంచాలనీ వారు డిమాండ్ చేశారు..

No comments:

Post a Comment