Breaking News

25/09/2019

మరో వివాదంలో తిరుమల

తిరుమల, సెప్టెంబర్ 25  (way2newstv.in)
తిరుమలకు వెళ్లే ఆర్టీసీ బస్సు టికెట్లపై హజ్, జెరూసలేం యాత్రకు సంబంధించిన ప్రకటనలు ముద్రించిన విషయం ఇటీవల వెలుగుచూసిన విషయం తెలిసిందే. దీనిపై రాజకీయంగానూ పెను దుమారమే రేగింది. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరిస్తున్నారంటూ భక్తులు సైతం మండిపడుతున్నారు. తాజాగా, టీటీడీ ఆన్‌లైన్ బుక్‌స్టోర్‌లో అన్యమతాలకు చెందిన పుస్తకాలను అమ్ముతున్న విషయం వెలుగుచూసింది. హిందూ పుస్తకంలో క్రైస్తవ మతానికి చెందిన అంశాలు ఉండటంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ టీటీడీకి లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ (ఎల్పీఆర్ఎఫ్) నోటీసులు జారీచేసింది. టీటీడీ సహకారంతో 2002లో మెండా చిన సీతారామయ్య ‘భక్తి గీతామృతలహరి’అనే పుస్తకాన్ని రాశారు.
మరో వివాదంలో తిరుమల

హిందూ దేవుళ్లు, దేవతలకు సంబంధించిన కీర్తనల పుస్తకంలోని 182, 183, 184 పేజీల్లో మాత్రం జీసస్‌ను కీర్తించడం గమనార్హం. దీనిపై ఎల్పీఆర్పీఎఫ్ మండిపడింది. టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌లో ఈ పుస్తకానికి చెందిన పీడీఎఫ్‌ను అప్‌లోడ్ చేయడం దురదృష్టకరమని పేర్కొంది. ఈ పుస్తకాన్ని  నుంచి డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయం కూడా కల్పించింది. అయితే, ప్రస్తుతం ఈ లింక్‌ను టీటీడీ తొలగించింది. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు.టీటీడీ అధికారికి వెబ్‌సైట్‌లో క్రైస్తవ మతానికి చెందిన సాహిత్యాన్ని ప్రచురించడంపై ఎల్పీఆర్పీఫ్ ఫిర్యాదు చేసింది. ఈ విషయం తెలియడంతో సోషల్ మీడియాలో టీటీడీ నిర్వాకంపై విమర్శలు వెల్లువెత్తాయి. కొందరు భక్తులు టీటీడీ ఆఫీసుకు ఫోన్‌చేసి ఆగ్రహం వ్యక్తం చేయడంతో స్పందించిన అధికారులు వాటిని తొలగించారు. సంబంధిత స్క్రీన్ షాట్లు అప్పటికే వైరల్ కావడంతో నెటిజన్లు దుయ్యబడుతున్నారు. హిందూయేతర సాహిత్యాన్ని ఆన్‌లైన్ బుక్‌స్టోర్‌లో ఉంచడమేంటని, దీనిపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు..

No comments:

Post a Comment