Breaking News

30/09/2019

ఏపీలో సలహాదారులకు భారీ నజరానాలు

భారంగా మారుతున్న ఖజనాలు
హైద్రాబాద్, సెప్టెంబర్ 30, (way2newstv.in)
ఏపీలో నెరేగా తర్వాత ముందు సరేగా అమలు చేయాలి. ఖజానాలో డబ్బుల్లేవు పనులు చేయడానికి నిధుల్లేవు. ప్రోటోకాల్‌ కహానీలు ఇవేమి చెప్పొద్దు. చెప్పింది చేయకపోతే పోస్టింగ్‌లు ఊడిపోతాయి. నిన్న మొన్న ఏం జరిగిందో తెలుసు కదా? అడ్వైజర్లకు ప్రిన్సిపల్‌ సెక్రటరీ… చీఫ్ సెక్రటరీ క్యాడర్‌ జీతభత్యాలు కుదరవన్నందుకు ఆ అధికారికి ఏం జరిగిందో తెలుసు కదా? చెప్పింది చేయకపోతే …… మరుక్షణం ఆ పని చేసే వాళ్లు ఆ కుర్చీల్లోకి వచ్చేస్తారు. “సాక్షి రిటర్న్డ్‌ ఎంప్లాయ్‌మెంట్‌ గ్యారంటీ యాక్ట్‌” పక్కాగా అమలు చేయాలి. ప్రోటోకాల్‌లో పి., క్యూ, ఆర్‌ రూల్స్‌ అంటూ మార్గదర్శకాలు వల్లించారో ఖర్చయిపోతారు జాగ్రత్త. గ్రామ సచివాలయ ఉద్యోగాలంటే ఏపీ-తెలంగాణ రాష్ట్రాలనే తేడాలుంటాయి కాని సలహాదారులు…. కో ఆర్డినేటర్లు…. ఆప్తజనానికి దోచిపెట్టడానికి ఇలాంటి నిబంధనలేమి అక్కర్లేదు.
ఏపీలో సలహాదారులకు భారీ నజరానాలు

ఆంధ్రా కుర్రోళ్లని పెళ్లి చేసుకుని…. పోటీ పరీక్షల్లో మంచి మార్కులతో నెగ్గిన వారికి స్థానికత అడ్డొస్తుంది కానీ పైరవీలతో పెద్ద పదవుల్లో తిష్టవేసే వాళ్లకి ఇవేం అడ్డంకి కాలేవు. సలహాదారుల రూపంలో రోజుకో మనిషి ఎంట్రీ ఇస్తూనే ఉన్నారు. నిన్న కాక మొన్న నేషనల్ మీడియా అడ్వైజర్‌ పేరుతో దేవులపల్లి అమర్‌ దాదాపు 4 లక్షల రుపాయల జీత భత్యాలు చెల్లిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే ఢిల్లీలో మీడియా ఓఎస్డీగా సాక్షి మాజీ ఉద్యోగి అరవింద్‌ యాదవ్‌ను నియమించారు. చంద్రబాబు హయంలో ఇదే పదవిలో ఉన్న వ్యక్తి లక్షన్నరకు పైగా జీతం, భారీగా హెచ్‌ఆర్‌ఏ అందుకుంటూ ఏపీ భవన్‌లో బస చేసి ఆ డబ్బు కూడా జేబులో వేసుకున్నా అప్పటి రెసిడెంట్‌ కమిషనర్‌., ప్రస్తుత సీఎం ముఖ‌్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్‌ చూసి చూడనట్టు వదిలేశారు.అప్పట్లో ఆ లెక్క వేరు. అప్పుడాయన చంద్రబాబు మనిషి. ఇప్పుడాయన వైఎస్ జగన్ మనిషి కాబట్టి అడిగిన వాళ్లందరికి సౌకర్యాలు ఇచ్చేస్తున్నారు. అందుకే ఇప్పుడు అలాంటి ఖాతాలు ఒకటికి నాలుగు తయారయ్యాయి. దేవులపల్లి అమర్‌ బాటలో సాక్షి మాజీ ఎడిటర్‌ రామచంద్ర మూర్తిని నియమించారు. తెలంగాణ రాష్ట్రం తన వల్లే ఏర్పడిందని, తెలంగాణ మేధావి వర్గాన్ని ఏకం చేయడంలో.. రాష్ట్ర విభజనకు దశా దిశ చూపించడంలో తానే కీలక పాత్ర పోషించినా కేసీఆర్‌ తనను పట్టించుకోలేదని బాహాటంగానే చెప్పే వారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ ప్రభుత్వం తన సేవలు గుర్తించి రెడ్ కార్పెట్‌ వేస్తుందని భావించినా అలా జరగలేదు. అందుకు కారణాలేమిటో మీడియా సర్కిల్స్‌లో పెద్ద తలకాయలందరికి తెలుసు. ఆ తర్వాత మళ్లీ సాక్షి లో చేరి తెలంగాణ భావజాలాన్ని వ్యాపింప చేయడంలో తన వంతు పాత్ర పోషించినందుకు కృతజ్ఞతగా ఆయనకు ఏపీ పబ్లిక్‌ పాలసీ అడ్వైజర్‌గా పదవి దక్కింది.ఇప్పటికే ముఖ్యమంత్రి మీడియా అడ్వయిజర్‌గా ఖమ్మం జిల్లాకు చెందిన జి.వి.డి కృష్ణ మోహన్‌ పనిచేస్తున్నారు. అదే జిల్లాకు చెందిన కొండుభట్ల వారికి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్ పాలసీ సలహాదారు పదవి వచ్చేసింది. ఆ పక్కనే ఉన్న నల్లగొండ జిల్లాకు చెందిన తుమ్మా విజయ్‌కుమార్‌ రెడ్డికి ఐ అండ్‌ పిఆర్‌ కమిషనర్‌ పదవి దక్కింది. తర్వాత నామినేటెడ్ పదవుల కోసం ఎదురుచూస్తున్న జాబితాలో సాక్షి దినపత్రిక ద్వారా ఆంధ్రా వ్యతిరేకత వ్యాప్తి చేసిన మేధావులు ఉన్నారు. వీళ్లెవరికి ఏపీలో ఓటు హక్కు కాదు కదా కనీసం ఓ నలుగుర్ని పోగేసే సత్తా కూడా లేకున్నా… అలా పనులు జరిగిపోతుంటాయి. శాప్‌నెట్‌ టీవీ సీఈఓకు , ఎస్వీబీసీ సీఈఓ పోస్టుల్లో కూడా వాళ్లనే పెడతారు. ఆ తర్వాత సాక్షి దినపత్రికలో వ్యాసాలు కుమ్మరించే ఓ టీంకు, మావోయిస్టు సానుభూతిపరులకు., తెలంగాణ జర్నలిస్టు ఉద్యమ నాయకులకు కూడా ఏదొక సలహాదారు పదవి కట్టబెట్టి న్యాయం చేయాల్సిన బాధ్యత కూడా జగన్మోహన్‌ రెడ్డి మీద ఉంది. వీళ్లంతా నీ చుట్టూ ఉంటేనే కదా ఆంధ్రా ఓటర్లకు చిరాకు పుట్టేది. అయినా ఒకటికి పదిమంది నీ చుట్టూ చేరినా జనాలకు ఒరిగే మంచేమి ఉంటుంది. ఆంధ్రుల మీద నిలువునా విషం చిమ్మిన మేధావులే కావాలనుకుంటే ప్రజలకు అంతకంటే కావాల్సిందేముంటుంది. జనం పిచ్చి గొర్రెలు ఏమి పట్టించుకోరనుకున్న 40 ఇయర్స్ ఇండస్ట్రీకి ఏమైందో అదే రిపీట్ అయిద్ది. ఆల్‌ ది బెస్ట్ జగనన్నా.

No comments:

Post a Comment