Breaking News

28/08/2019

ఏప్రిల్ ఒకటినుంచి బియ్యం పంపిణీ - మంత్రి కొడాలి నాని

అమరావతి ఆగస్టు 28, (way2newstv.in - Swamy Naidu)
సార్టెక్స్ బియ్యం సరఫరాకు అవసరమైన ధాన్యం ప్రస్తుతం అందుబాటులో లేదు. అందుకే వచ్చే నెలలో శ్రీకాకుళం జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ అమలు చేస్తున్నామని పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని అన్నారు. బుధవారం అయన మీడియాతో మాట్లాడారు. శ్రీకాకుళం జిల్లాలో 20 కేజీల బ్యాగులను వాలంటీర్ల ద్వారా డోర్ డెలివరీ చేస్తాం. ఏప్రిల్ ఒకటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ చేస్తాం. సార్టెక్స్ బియ్యం మిషనరీ వల్ల అదనంగా పడే విద్యుత్ భారం పై ఆర్థిక శాఖ పరిశీలన చేస్తోందని అయన అన్నారు. చంద్రబాబు నిర్లక్ష్యం వల్ల 1100 కోట్లు మిల్లర్లకు బకాయిలు ఉన్నాయి. స్వర్ణ బియ్యం పండించేలా రైతులకు అవగాహన నిర్వహిస్తామని అన్నారు. రాష్ట్రంలో పౌరసరఫరాల సంస్థ ద్వారా కోటి 40 లక్షల మంది రేషన్ కార్డుదారులకు సుమారు 11వేల కోట్ల రూ.లు విలువైన బియ్యం కిలో రూపాయికే పంపిణీ చేస్తున్నందున మద్యదళారుల ప్రమేయం లేకుండా తూకాల్లో తేడాలు లేకుండా మెరుగైన రీతిలో బియ్యం పంపిణీకి చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రి స్పష్టం చేశారు. 

ఏప్రిల్ ఒకటినుంచి బియ్యం పంపిణీ  - మంత్రి కొడాలి నాని
రాష్ట్రంలో ఉన్న మొత్తం రేషన్ కార్డుదారుల్లో 92లక్షల మంది కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ అందిస్తుండగా మిగతా 55 లక్షల మంది కార్డుదారులకు రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తోందని తెలిపారు.వచ్చే ఏప్రిల్ నుండి రాష్ట్రవ్యాప్తంగా పూర్తిస్థాయిలో నాణ్యమైన బియ్యం అందించనున్నందున పాలిథిన్ బ్యాగులస్థానే పూర్తి పర్యావరణహితమైన బ్యాగులతో అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ఇందుకుగాను నెలకు 2 కోట్ల బ్యాగులు సరఫరా చేసేందుకు వీలుగా చర్యలు ఒక సంస్థకు ఆర్డర్ ఇవ్వనున్నట్టు తెలిపారు. గ్రామ,వార్డు వాలంటీర్ల ద్వారా బియ్యం ఇతర సరుకులు ఇంటింటా పంపిణీ చేపట్టినప్పటికీ ప్రస్తుతం ఉన్న రేషన్ డీలర్లు ఎవరినీ తీయబోమని మంత్రి నాని స్పష్టం చేశారు.

No comments:

Post a Comment