Breaking News

28/08/2019

గులాబీ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నకమలం

హైద్రాబాద్, ఆగస్టు 28 (way2newstv.in)
తెలంగాణలో టీఆర్‌ఎస్‌ ప్ర‌భుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేయ‌డ‌మే బీజేపీ టార్గెట్‌గా పెట్టుకుంది. ప్ర‌తి అంశ‌ంలోనూ ప‌దునైన విమ‌ర్శ‌లు చేస్తూ దాడికి దిగుతున్న రాష్ట్ర బీజేపీ శాఖ.. కేంద్ర ప్ర‌భుత్వ అండ‌దండ‌ల‌తో టీఆర్ఎస్ పై దాడిని ముమ్మ‌రం చేస్తోంది. ఇక వివిద శాఖ‌ల్లో జ‌రుగుతున్న అవినీతి ప్ర‌ధానాస్త్రంగా తీసుకోని రోజుకో అంశాన్ని లేవ‌నెత్తుతున్న బీజేపీ.. తెలంగాణ నాయ‌క‌త్వం టీఆర్ఎస్ అవినీతిని కేంద్ర విచార‌ణ సంస్థ‌ల‌తో విచార‌ణ జ‌రిపించాల‌ని డిమాండ్లు చేస్తోంది. ఇంట‌ర్ బోర్డు, విద్యుత్ కొనుగోళ్ళు, గ్రానైట్ అక్ర‌మాల‌పై కేంద్ర విచార‌ణ సంస్థ అధ్వ‌ర్యంలో పూర్తిస్థాయి విచార‌ణ జ‌రిపించాలంటూ డిమాండ్ చేస్తోంది. ఇంతకీ దీని వెన‌కున్న మతలబేంటి..? కేంద్ర నాయ‌క‌త్వ ఆదేశాల మేర‌కే బీజేపీ రాష్ట్ర నాయకులు దూకుడు పెంచారా..?.టీఆర్ఎస్ ప్ర‌భుత్వంపై ఇక పోరాటాల‌కు సిద్దం అంటున్న బీజేపీ జాతీయ అద్య‌క్షుడి మాటల‌ను ఆచ‌ర‌ణలో చేసి చూపెడుతోంది తెలంగాణ బీజేపీ రాష్ట్ర శాఖ‌.
గులాబీ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నకమలం

ఇంత కాలం స‌భ్య‌త్వ న‌మోదు కార్య‌క్ర‌మంపై దృష్టి సారించిన ఆ పార్టీ ఇక రాష్ట్ర ప్ర‌భుత్వ వైఫ‌ల్యాలే టార్గెట్ గా దూకుడు పెంచుతోంది. రాష్ట్రంలో వివిధ శాఖ‌ల్లో జ‌రుగుతున్న అక్ర‌మాల‌పై పూర్తివివ‌రాల‌ను సేక‌రిస్తోన్న బీజేపీ రోజుకో అంశంపై ప్ర‌భుత్వంపై మాట‌ల యుద్దానికి తెర‌తీస్తోంది. గ‌తంలో బీజేపీ విమ‌ర్శ‌లను పెద్ద‌గా ప‌ట్టించుకోని టీఆర్ఎస్ ప్ర‌స్తుతం విమ‌ర్శ‌ల‌కు స్పందిచ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితులు క‌ల్పిస్తోంది బీజేపీ నాయ‌క‌త్వం. ఇంట‌ర్ విద్యార్దుల ఆత్మ‌హ‌త్యల‌పై రాష్ట్రప‌తి, కేంద్ర హోం శాఖలు పూర్తి వివ‌రాలు త‌మ‌కు అంద‌జేయాల్సిందిగా రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శికి లేఖ పంపాయి. స‌భ్య‌త్వంపై కేటీఆర్.. బీజేపీల మ‌ధ్య మాట‌ల యుద్ద‌మే జ‌రిగింది. అనంత‌రం విద్యుత్ కొనుగోలు ఒప్పందాల‌ పైనా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ల‌క్ష్మ‌ణ్ ప్ర‌భుత్వానికి స‌వాల్ విసిరారు. ఇందుకు విద్యుత్ సంస్థ‌ల సీఎండీ స్పందించి ఏ విచార‌ణ‌కైనా సిద్దం అంటూ ప్ర‌క‌టించాల్సి వ‌చ్చింది. దీంతో విద్యుత్ విష‌యంతో ఆరోప‌ణ‌ల‌కు మ‌రింత ప‌దును పెంచిన ల‌క్ష్మ‌ణ్ ప్ర‌భాక‌ర్ రావు స‌వాల్ కు మేం సిద్దంగా ఉన్నాం అంటూ ప్ర‌క‌టించారు. విద్యుత్ కొనుగోలుపై రాష్ట్ర ముఖ్య‌మంత్రే విచార‌ణ జ‌రిపించాల‌ని డిమాండ్ చేసారు. లేదంటే తామే కేంద్ర ప్ర‌భుత్వానికి లేఖ రాసి సీబీఐ విచార‌ణ జ‌రిపించాల‌ని కోరుతామ‌ని తెలిపారు. విద్యుత్ కొనుగుళ్ళ పేరుతో ఎవ‌రెవ‌రు ఎంత దండుకున్నారో చిట్టాతో స‌హా పూర్తివివ‌రాలు అంద‌జేస్తామ‌న్నారు. టీఆర్ఎస్ పాల‌న‌లో అవినీతిపై రాజ‌కీయంగానే కాకుండా న్యాయ‌ప‌ర‌మైన పోరాటాల‌ను కూడా ఉదృతం చేస్తామ‌ని హెచ్చ‌రించారు.ఇక తెలంగాణ అత్య‌ధిక ఆదాయం వ‌చ్చే మ‌రో రంగం మైనింగ్. ఏటా వంద‌ల కోట్ల రూపాయాల ఆదాయం ప్ర‌భుత్వానికి మైనింగ్ శాఖ నుండి స‌మకూరుతోంది. అయితే ప్ర‌భుత్వానికి వ‌చ్చే ఆదాయం కంటే వ్యాపారులు, అధికార పార్టీ నాయ‌కుల జేబుల్లోకి వెళ్ళే ఆదాయ‌మే ఎక్క‌వంటోంది బీజేపీ. క‌రీంన‌గ‌ర్ తో పాటు ఉత్త‌ర తెలంగాణ‌లో విస్త‌రించి ఉన్న గ్రానైట్ మైనింగ్ లో ప‌న్నులు ఎగ‌వేస్తూ అక్ర‌మంగా మైనింగ్ చేయ‌డమే కాకుండా గుట్టుచ‌ప్పుడు కాకుండా వేల కోట్ల విలువైన గ్రానైట్ ను విదేశాల‌కు త‌ర‌లిస్తున్నార‌ని క‌రీంన‌గ‌ర్ ఎంపీ బండి సంజ‌య్ ఆరోపించారు. మైనింగ్ అక్ర‌మాలు వెలుగులోకి రావాలంటే రాష్ట్ర ప్రభుత్వం స్వ‌చ్చందంగా విచార‌ణ చేప‌ట్టి దోషుల‌ను శిక్షించాల‌ని లేదంటే కేంధ్ర ప్ర‌భుత్వానికి ఫిర్యాదు చేస్తామ‌ని హెచ్చరిస్తున్నారు. ఇప్ప‌టికే ఈడీ, రైల్వే మంత్రుల‌కు గ్రానైట్ అక్ర‌మ త‌ర‌లింపుపై ఫిర్యాదు చేస్తామ‌ని విచార‌ణ‌కు కూడా ఆదేశిస్తామ‌ని తెలిపార‌న్నారు. ఇక మైనింగ్ అక్ర‌మాల పై లోతైన విచార‌ణ జ‌రిపించేలా గ‌వ‌ర్న‌ర్ కు ఫిర్యాదు చేయ‌డం తో పాటు న్యాయ ప‌ర‌మైన పోరాటానికి కూడా సిద్ద‌మ‌వుతున్నామ‌న్నారు. ఇక ఇదే విశ‌యంపై ప్రధానిని క‌లిసి గ్రానైట్ మాఫియాపై సీబీఐ విచార‌ణ జ‌రిపించాల‌ని కోరుతామ‌న్నారు.బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడే కేంద్ర హోం శాఖ మంత్రిగా ఉండ‌డం.. ఇప్ప‌టికే ఆయ‌న పార్టీ నేత‌ల‌కు ప్ర‌భుత్వం పోరుకు అండ‌గా ఉంటామ‌ని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో  వివిధ శాఖల అవినీతిపై రాష్ట్ర శాఖ సీబీఐ విచార‌ణ కోరుతుండ‌డం ఆయ‌న హోం మంత్రిగా ఉండ‌డంతో టీఆర్ఎస్ ప్ర‌భుత్వంపై క‌చ్చితంగా సీబీఐ విచార‌ణ‌లు జ‌రిపి ఉక్కిరి బిక్కిరి చేస్తారా లేక కేవ‌లం టీఆర్ఎస్ ను త‌మ గుప్పిట్లోకి తెచ్చుకునేందుకు ఇలాంటి హెచ్చ‌రిక‌లు చేస్తున్నారా వేచి చూడాలి.

No comments:

Post a Comment