నెల్లూరు, ఆగష్టు 6 (way2newstv.in - Swamy Naidu )
రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చి రెండు నెలలు దాటింది..ఎన్నికల కోడ్ సమయం నుంచే ఈసీని అడ్డంపెట్టుకుని ఐదు నెలలుగా పాలిస్తున్నారు. కొత్త ప్రభుత్వం వచ్చినప్పటికీ వ్యవస్థలను కుప్పకూల్చడం సరికాదు..లోటుపాట్లు ఉంటే సరిదిద్దండి. ఇసుక లేక చిన్నచిన్న నిర్మాణాలు సైతం ఆగిపోయాయి..ఆ రంగంపై ఆధారపడిన లక్షల కుటుంబాలు రోడ్డునపడ్డాయని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నారాయణ అన్నారు. మంగళవారం నెల్లూరులోని టీడీపీ జిల్లా కార్యాలయంలో నెల్లూరు సిటీ నియోజకవర్గ సమావేశంలో వారు పాల్గొన్నారు. సోమిరెడ్డి మాట్లాడుతూ రాజధాని, పోలవరం ప్రాజెక్టుతో పాటు చిన్నచిన్న కాలువల నిర్మాణం కూడా ఆపేశారు..కంపెనీలు దివాళా తీసే పరిస్థితి తెచ్చారు..వీటి ద్వారా మీకు లభించే ఆనందం ఏంటో అని ప్రశ్నించారు.
నిర్మాణాలు ఆగిపోయాయి
1851 సీట్లతో అధికారంలోకి వచ్చిన మీకు ఇంకా ఏం కావాలో అర్ధం కావడం లేదు..ఇంత శాడిజం ఎందుకో. వరద, కరువుప్రాంతాల్లో పర్యటించే నాయకులు కరువయ్యారని విమర్శించారు. ఎంతసేపటికీ దానిని ఆపండి..దీనిని ఆపండి అని చెప్పడంతో సరిపెట్టుకుంటున్నారు. ప్రజలు మీకు అధికారం ఇచ్చింది టీడీపీ కార్యకర్తలను కొట్టడానికో, కత్తులతో పొడవడానికో కాదు. ప్రశాంతతకు మారుపేరైన నెల్లూరు జిల్లాలో ఇలాంటి పరిస్థితులు ఎప్పుడూ లేవు. నెల్లూరులోనే ఇలా ఉంటే మిగిలిన జిల్లాల్లో ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. గ్రామ వలంటీర్ పోస్టులకు అర్హత ఉన్నా లేకపోయినా ఎమ్మెల్యే ఇచ్చే చీటీనే రిక్రూట్ మెంట్ లెటర్ గా మార్చేశారని ఆరోపించారు. టీడీపీ హయాంలో రూపాయి జీతం లేకుండా పనిచేసిన జన్మభూమి కమిటీ సభ్యులను చెండాళంగా మాట్లాడారు. ఈ రోజు వైసీపీ కార్యకర్తలనే వలంటీర్లుగా నియమించి నెలా నెలా రూ.5 వేలు ఇవ్వబోతున్నారు. వలంటీర్ల నియామకంలో 80 శాతం మెరీట్ కు సంబంధించిన సుప్రీంకోర్టు మార్గదర్శకాలను కూడా విస్మరించారు. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి పునరాలోచించుకోవాలి. శాంతియుత పాలనకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతున్నామని అన్నారు.
No comments:
Post a Comment