డెహ్రడూన్ ఆగష్టు 6 (way2newstv.in - Swamy Naidu)
ఉత్తరాఖండ్ లో విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. స్కూల్ వ్యాన్ లోయలో పడి అందులో ప్రయాణిస్తున్న తొమ్మిది మంది పిల్లలు మృత్యువాత పడ్డారు. ఈ సంఘటన తెహ్రీ గర్హ్వాల్ లోని కంగ్సాలి గ్రామ సమీపంలో మంగళవారం ఉదయం జరిగింది.
లోయలో పడిన స్కూల్ వ్యాన్… తొమ్మిది మంది చిన్నారుల మృతి
ఉత్తరాఖండ్ లో విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. స్కూల్ వ్యాన్ లోయలో పడి అందులో ప్రయాణిస్తున్న తొమ్మిది మంది పిల్లలు మృత్యువాత పడ్డారు. ఈ సంఘటన తెహ్రీ గర్హ్వాల్ లోని కంగ్సాలి గ్రామ సమీపంలో మంగళవారం ఉదయం జరిగింది. ఇద్దరు పిల్లలు అక్కడికక్కడే మరణించగా ఏడు మంది ఆసుపత్రిలో మృతి చెందారు. బస్సులో మొత్తం 18 పిల్లలు ప్రయాణిస్తున్నారు. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో వాహనం రోడ్డుపై నుంచి దూసుకెళ్లి లోయలో పడింది. ప్రమాదంలో తొమ్మిది మరణించినట్లు పోలీసు ఇన్ స్పెక్టర్ జనరల్ అజయ్ రౌటేలా ధృవీకరించారు. గాయపడినవారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు.
ఇద్దరు పిల్లలు అక్కడికక్కడే మరణించగా ఏడు మంది ఆసుపత్రిలో మృతి చెందారు. బస్సులో మొత్తం 18 పిల్లలు ప్రయాణిస్తున్నారు. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో వాహనం రోడ్డుపై నుంచి దూసుకెళ్లి లోయలో పడింది. ప్రమాదంలో తొమ్మిది మరణించినట్లు పోలీసు ఇన్ స్పెక్టర్ జనరల్ అజయ్ రౌటేలా ధృవీకరించారు. గాయపడినవారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు.
No comments:
Post a Comment