Breaking News

06/08/2019

నల్లమల అడవిలో యురేనియం తవ్వకాలను వెంటనే నిలిపిఎయాలి ఏఐసీసీ కార్యదర్శి వంశీచందర్ రెడ్డి డిమాండ్

 హైదరాబాద్ ఆగష్టు 6  (way2newstv.in - Swamy Naidu)
నల్లమల అడవిలో యురేనియం తవ్వకాలను వెంటనే నిలిపిఎయాలని ఏఐసీసీ కార్యదర్శి వంశీచందర్ రెడ్డి డిమాండ్ చేసారు.మంగళవారం గాంధీ భవన్ లో మీడియా సమావేశం లో మాట్లాడుతూ నల్లమల ప్రాంతం తెలంగాణ ప్రాంతానికి ఊటీ లాంటిది.. దీన్ని పాలకులు లూటీ చేయాలని చూస్తున్నారని ఆరోపించారు.గతంలో మేము ఉద్యమిస్తే ఆపేశారు..కానీ మళ్ళీ యురేనియం తవ్వకాలకు కేంద్రం అన్నిఅనుమతులు వచ్చాయని ఇక తవ్వకాలు మొదలు అని అంటున్నారు. ఇది టైగర్ రేజెర్వే ఫారెస్ట్, చెంచులు, ఆదివాసీలు బతుకుతున్న ప్రాంతం. దీన్ని మేము ఖచ్చితంగా కాంగ్రెస్ వ్యతిరేకిస్తున్దన్నరు.బహుళ జాతి కంపెనీలకు కోట్ల రూపాయలు కట్టబెట్టడానికి ఇక్కడి ప్రజలను,అటవీ సంపదను బలి చేస్తారా అని వంశీ చాంద్ప్రశ్నించారు.విదేశాలలో,  కడపలో కూడా యురేనియం తవ్వకాలను ఆపేశారు.
నల్లమల అడవిలో యురేనియం తవ్వకాలను వెంటనే నిలిపిఎయాలి  ఏఐసీసీకార్యదర్శి వంశీచందర్ రెడ్డి డిమాండ్
దీని వల్ల పుట్టబోయే బిడ్డలకు కూడా అంగవైకల్యం ఏర్పడుతుందని తెలిపారు.ప్రకృతి పూర్తిగా పడు అవుతుంది. శ్రీశైలం నది జలాలు కలుషితం అవుతాయి. గాలి, నీరు వాతావరణ పూర్తిగా దెబ్బ తింటుందని, నాగార్జునసాగర్ నీరు తాగే హైద్రాబాద్ ప్రజలకు కూడా దీని ప్రభావం పడనుందన్నారు.గతంలో కేసీఆర్ బిడ్డ కవిత యురేనియం కు వ్యతిరేకంగా రాటాలు చేశారు.యురేనియం ప్రభావం వల్ల ఆరోగ్యాలు తీవ్రంగా దెబ్బతింటాయన్నారు. ఈ ఉద్యమంలో కలిసి వచ్చే అందరితో కలిసి పోరాటాలు చేస్తాం. ఉద్యమాన్ని ఉదృతం చేస్తా..ఆపేవరకు పోరాటం ఆగదని వంశీ చందర్ రెడ్డి హెచ్చరించారు.మన రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాలకు నష్టం జరుగతామీ కాకుండా అమ్రాబాద్ టైగర్ ఫారెస్ట్ దెబ్బతింటుందన్నారు. కృష్ణ జలాలు తాగే అందరికి నష్టం జరగనుందని,యురేనియం మైనింగ్ వల్ల ఇంత పెద్ద నష్టం వల్ల తాము వ్యతిరేకిస్తున్నామన్నారు.ఈ యురేనియం వ్యతిరేక పోరాటానికి తాము సంపూర్ణాంగా మద్దతు ఇస్తమని తెలిపారు.ఈ పోరాటానికి మద్దతు ఇచ్చిన కోదండరాం ను అరెస్ట్ చేయడాన్ని ఆయన ఖందించారు.స్టేట్ వైల్డ్ లైఫ్ బోర్డ్ కు ముఖ్యమంత్రి ఛైర్మెన్ గా  ఉంటారు. ఇలాంటి భయాంకరమైన సమస్యల విషయంలో సీఎం వెంటనే స్పందించాలని డిమాండ్ చేసారు.టీఆరెస్ ఎంపీ రాములు, కేసీఆర్ కూతురు కవిత లు యురేనియం వ్యతిరేకంగా మాట్లాడారని, మీరు కూడా వెంటనే కేంద్రానికి లేఖ రాయాలని కోరారు.

No comments:

Post a Comment